Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వితంతు పెన్షన్‌ కోసం భర్త బతికుండగానే కాటికి పంపిన భార్య..

వితంతు పెన్షన్‌ కోసం భర్త బతికుండగానే కాటికి పంపిన భార్య..
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:24 IST)
ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మరిచిపోతున్నారు. భార్యాభర్తల బంధం అంతకంటే దారుణంగా తయారైంది. తాజాగా ఓ భార్య కట్టుకున్న భర్త జీవించివుండగానే, చనిపోయినట్టు అధికారులను నమ్మించింది. అదీ వితంతు పెన్షన్ డబ్బుల కోసం ఈ ఘరానా మోసానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఓ మహిళ డబ్బులకు కక్కుర్తిపడి ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను కూలి పనుల కోసం ముంబైకు పంపించింది. దీంతో ఆయన కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ విషయాన్ని అధికారులను నమ్మించి వింతంతు పెన్షన్ తీసుకుంటూ వస్తోంది. 
 
అయితే, భర్త ఉన్నట్టుండి గ్రామానికి రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన భార్య చేసిన నిర్వాహం తెలుసుకున్న ఆయన.. తాను బతికే ఉన్నట్టు అధికారులకు తెలిపాడు. దీంతో మహిళల వితంతు పెన్షన్‌ను నిలిపివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మీనా