Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుప్పంలో కూలబడిన తెదేపా... వైసిపికి ఇక ఎదురు వుండదా?

Advertiesment
కుప్పంలో కూలబడిన తెదేపా... వైసిపికి ఇక ఎదురు వుండదా?
విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (11:59 IST)
ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా, చాలా ఉత్కంఠ‌గా మారాయి. ఇక్క‌డ టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడ‌తామ‌ని వైసీపీ నేత‌లు చెపుతుండ‌గా, తామే ప‌ట్టు నిలుపుకుంటామ‌ని టీడీపీ చెపుతోంది. 
 
 
కుప్పం పురపాలక ఎన్నికల మొదటి రౌండు  ఓట్ల లెక్కింపులో 14వార్డులలో 13వార్డులు వైసీపీ కైవసం చేసుకుంది. దీనితో ట్రెండ్స్ వైసీపీ వైపే ఉన్నాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు సంబ‌ర‌ప‌డుతున్నారు. 1వార్డు  టీడీపీ 374  వైసీపీ 1028, 2వార్డు   టీడీపీ 455  వైసీపీ  807, 3 వార్డు  టీడీపీ 497  వైసీపీ 595, 4వ వార్డు టీడీపీ 498  వైసీపీ 713, 7వార్డు  టీడీపీ 436  వైసీపీ 736, 8వార్డు టీడీపీ  419  వైసీపీ 695, 9 టీడీపీ 711 వైసీపీ  788, 10  వైసీపీ 419 వైసీపీ 695, 12వార్డు టీడీపీ 554 వైసీపీ 742, 13వార్డు  టీడీపీ 506  వైసీపీ 621, 15వార్డు టీడీపీ  518 వైసీపీ  981 ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.
 
 
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని టీడీపీ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని టీడీపీ కోరింది. దీనిపై పిటిషనర్ల తరపున వాదనలు విని, ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. దీనితో కౌటింగ్ వీడియో రికార్డింగ్‍ను హైకోర్టుకు సమర్పించేందుకు ప‌క‌డ్బందీగా ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిండి దొరక్క అల్లాడుతున్న అమెరికన్ సైన్యం కుటుంబాలు, ఏమైంది?