Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యుత్ ఉత్పత్తి ఆపండి..కేఆర్ఎంబీ సీరియస్

విద్యుత్ ఉత్పత్తి ఆపండి..కేఆర్ఎంబీ సీరియస్
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:14 IST)
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది కేఆర్ఎంబీ. రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. ఇప్పటికే రాసిన లేఖలపై ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు.
 
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ సంవ‌త్సరం మే నెల వ‌ర‌కు తెలంగాణ‌కు మూడు టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు ఆరు టీఎంసీలు తాగునీటికి కోసం అవ‌స‌రం ఉంటుంద‌ని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 34.24టీఎంసీలు మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
 
నిండుకుండలా ఉండాల్సిన శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుకుంటోంది. 215 టీఎంసీల సామర్థ్యానికి.. 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్‌ ఉత్పత్తిచేయడంతో ఈ దుస్థితి వచ్చిందటున్నారు ఇరిగేషన్ నిపుణులు.  
 
గత ఏడాది ఇదే సమయానికి 129.78 టీఎంసీల నీరు ఉంది. కాని ఇప్పుడు నీటి నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు పడిపోయింది. కేఆర్‌ఎంబీ లేఖ రాసిన తర్వాత ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తి కోసం 59 టీఎంసీలను వినియోగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
ఈ ఏడాది వెయ్యికిపైగా టీఎంసీల మేర ఇన్‌ఫ్లో వచ్చినా.. ప్రస్తుత నిల్వలు డెడ్‌ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు మేల్కోకపోతే సమ్మర్‌లో తాగునీటి సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు సుష్మా స్వరాజ్ జయంతి - బీజేపీ నేతల నివాళులు