కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం మహిళపై వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. సంక్షేమ పథకాల పేరుతో ఇంట్లో భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	వివరాల్లోకి వెళితే.. బంటుమిల్లి మండలం జానకిరామ్ పురంలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజులపాటి చంద్రశేఖర్ తన యాభై కుటుంబాల్లో ఒకరైన గుబ్బల విజయలక్ష్మిపై దాడి చేశాడు.
 
									
										
								
																	
	 
	వాలంటీర్ చంద్రశేఖర్ సంక్షేమ పథకాలు పేరుతో విజయలక్ష్మి భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి తన భర్త గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ విజయలక్ష్మి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	భర్త పని నుండి ఇంటికి రాగానే జరిగిన విషయాన్ని విజయలక్ష్మి తెలిపింది. ఈ విషయంపై వాలంటీర్‌ను నిలదీయగా.. అతడు విజయలక్ష్మిపై దాడి చేశాడు. ఈ ఘటనపై విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.