ఏపీ ఉపముఖ్యమంత్రికి మళ్లీ అవమానం... చేసిందెవరంటే...?
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఘోర అవమానం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి వల్లే జరగిందంటూ వార్తలు వస్తుండటం చర్చనీయాంశమైంది. తాజాగా కేఈ నుంచి పలు అధికారాలను చంద్రబాబు తప్పించినట్లు తెలుస్తోంది. వాటిని సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఇప్పటివరకు డిప
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఘోర అవమానం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి వల్లే జరగిందంటూ వార్తలు వస్తుండటం చర్చనీయాంశమైంది. తాజాగా కేఈ నుంచి పలు అధికారాలను చంద్రబాబు తప్పించినట్లు తెలుస్తోంది. వాటిని సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఇప్పటివరకు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీల అధికారాన్ని కలిగి వున్న కేఈ కృష్ణమూర్తి నుంచి సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ చేశారు.
ఈ మేరకు జీవో 28ని విడుదల చేశారు. గతంలో కేఈ కృష్ణమూర్తి చేసిన బదిలీలను చంద్రబాబు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఏ మంత్రి విషయంలో లేని విధంగా తనకు చంద్రబాబు చేసిన అవమానానికి మరొకరైతే మంత్రి పదవికే రాజీనామా చేసేవారని చెబుతున్నారు.
కానీ కేఈ కృష్ణమూర్తి కుమారుడు ఇసుక కుంభకోణంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. హంద్రీనీవా నదిలో మంత్రి కుమారుడి ఇసుక దందాపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపధ్యంలో ఎదురుతిరిగితే కేఈ కుమారుడు చిక్కుల్లో పడటం ఖాయం అంటున్నారు. కేఈకి ఇలాంటి అవమానాలు ఇప్పుడే కాదు.. తొలి నుంచి జరుగుతున్నాయి. నిజానికి రాజధాని అమరావతిలో భూములు సేకరణ రెవెన్యూ శాఖ పరిధిలోనే జరగాలి. కానీ కేఈ కృష్ణమూర్తికి రాజధాని భూసేకరణ బాధ్యతలు అప్పగించకుండా కొత్తవాడైన మంత్రి నారాయణకు రాజధాని భూ బాధ్యతలు కేటాయించారు.
అప్పుడు కూడా కేఈ ఏమీ చేయలేకపోయారు. కేఈ కృష్ణమూర్తి తన శాఖలో చిన్నచిన్న బదలీలు చేసే వీలు కూడా లేకుండా పోయింది. అయితే కుమారుడికిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేఈ మాత్రం నోరుమెదిపే అవకాశం లేదంటున్నారు.