Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25న కేసీఆర్, జగన్ వీడియో కాన్ఫరెన్స్ కలయిక

25న కేసీఆర్, జగన్ వీడియో కాన్ఫరెన్స్ కలయిక
, గురువారం, 20 ఆగస్టు 2020 (09:08 IST)
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న ఇద్దరు ముఖ్యమంత్రులతో కేంద్రజలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ సమక్షంలో సమావేశం కానున్నారు.

ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాలు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కృష్ణా గోదావరి బోర్డుల ఛైర్మన్లకు సమాచారం అందించింది. అయితే ఈ భేటీనేరుగా జరగడంలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతోంది.
 
ఈ నెల 25 ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కృష్ణా గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు తలపెట్టిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.

వీటి గురించి రెండు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. జగన్ సర్కారు కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం ఉత్తర్వుల జారీ చేయడంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఊపందుకున్నాయి.

ఆ మధ్య జరిగిన కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లోనూ పరస్పరం భిన్న వాదనలు వినిపించాయి. పొరుగు రాష్ట్ర ప్రాజెక్టుల వల్ల తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వాదించాయి. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

కొత్త ప్రాజెక్టుల పనులు ఆపాలని, ఫిర్యాదులు వచ్చిన ప్రాజెక్టుల సవివర ప్రాజెక్ట్ నివేదికలు ఇవ్వాలని రెండు బోర్డులు ఇరు రాష్ట్రాలను కోరాయి. డీపీఆర్‌లను ఇవ్వాలని గతంలోనే పలుమార్లు సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవి అందడం లేదని బోర్డులు చెప్పాయి. 
 
విచిత్రం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరగుతున్న రెండో అపెక్స్ కమిటీ సమావేశం ఇదే.
మొదటిసారి 2016 సెప్టెంబర్ 21న అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరి కాదు: పొంగులేటి