తూర్పుగోదావరిలో కరోనా కలకలం రేగింది. ఇటీవల చైనా నుంచి వచ్చిన వ్యక్తి గొంతునొప్పితో బాధపడుతుండడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు అతన్ని వెంటనే పరిశీలనలో పెట్టారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	ఆయన నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపారు. కరోనా వైర్‌సకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఇకపై హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వేదిక కానుంది.
 
									
										
								
																	వ్యాధి నిర్ధారణ కోసం రక్తనమూనాలను గాంధీ ఆస్పత్రిలోని వైరల్ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటివరకూ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ టెస్టింగ్‌కు సంబంధించిన రక్త నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపేవి.
 
									
											
							                     
							
							
			        							
								
																	అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా హైదరాబాద్‌లోనూ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.