Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-02-2020 నుంచి 29-02-2020 మీ వార ఫలితాలు

Advertiesment
23-02-2020 నుంచి 29-02-2020 మీ వార ఫలితాలు
, శనివారం, 22 ఫిబ్రవరి 2020 (19:58 IST)
మేషం: అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం
ప్రియతములను కలుసుకుని విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందుతారు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. మీరు చేయదలుచుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు గుర్తిస్తారు. చేతివృత్తుల వారికి అన్ని విధాలా పురోభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో చికాకులు తప్పవు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, అభిప్రాయాలు మార్చుకోవాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. శనివారం నాడు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులెదురవుతాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. ఇతరుల సహాయం అర్థించటానికి మొహమ్మాటం అడ్డు వస్తుంది. స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉన్నతస్థాయి అధికారులకు ఆకస్మిక స్థానచలనం లేదా ప్రయాణం చేయాల్సివస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం కార్యసాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. అయిన వారే మిమ్ములను అపార్థం చేసుకుంటారు. మీ శ్రీమతిని, పిల్లలను మెప్పించడం కష్టమవుతుంది. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు మనస్థిమితం ఉండదు. ప్రతి విషయంలోను ఏమరుపాటుగా ఉంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని ఆటంకాలెదురవుతాయి. ప్రముఖులతో లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీరు అమితంగా అభిమానించే వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. ప్రైవేట్ ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. కలప, సిమెంట్, ఇసుక, ఐరన్ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఏజెంట్లు, బ్రోకర్లకు నిరుత్సాహం తప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. మీ సమర్థత, నిజాయితీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆది, సోమవారాల్లో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తి కాకుండా చికాకు కలిగిస్తాయి. స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రావలసిన మొండిబాకీలు వసూలవుతాయి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్సులు, లీజులు మంజూరవుతాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. సేవా సంస్థలకు సహాయ సహకారాలందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ప్రైవేట్ సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయడం క్షేమదాయకం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఆప్తుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. దాంపత్య సుఖం, వాహనయోగం, కార్యసిద్ధి వంటి అనుకూల ఫలితాలున్నాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేయడానికి యత్నిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. చేతివృత్తుల వారు నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, పనివారలతో చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి అవసరమైన పర్మిట్లు మంజూరవుతాయి. సామాజిక దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. రావలసిన ఆదాయం రావడంతో మానసికంగా కుదుటపడతారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. కొత్తవారితో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. స్త్రీలు క్రీడలు, క్విజ్, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఆస్తి పంపకాల విషయమై సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. ఆత్మీయుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని ఆటంకాలెదురవుతాయి. దూరప్రయాణాల్లో చికాకులు తప్పవు. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ప్రింటింగ్ పనివారలకు మందకొడిగా ఉంటుంది. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వ్యవహార జయం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం వంటి శుభఫలితాలున్నాయి. ఇంటా బయటా మీ మాటకు ఆమోదం లభిస్తుంది. ఖర్చులు అధికం. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. శనివారం నాడు కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. విద్యార్థుల అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. గృహంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తం చేయండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు, ధనం చేజారిపోయే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరల వల్ల ఆది, సోమవారాల్లో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఉన్నతస్థాయి అధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మీ కదలికలు, స్థితిగతులపై కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. సమయానికి కావలసిన వస్తువు కనిపించక సతమతమవుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో పాటు సంప్రదింపులు జరుపుతారు. దూర ప్రయాణాల్లో ఊహించని ఆటంకాలెదురవుతాయి. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తి కాగలవు. మంగళ, బుధవారాల్లో మిత్రుల కలయిక అనుకూలించదు. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. రుణ, ఇతర చెల్లింపులు వాయిదా వేస్తారు. స్త్రీలు విలువైన వస్తువులు, అలంకరణల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు తలెత్తుతాయి. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశానికే ప్రాధాన్యత నివ్వడం మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలకు అనుకూలం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ఆది, గురువారాల్లో మీ ఆంతరంగిక విషయాలు, పథకాలు గోప్యంగా ఉంచండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు నరాలు, ఎముకలు, కళ్లు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర, ఫ్యాన్సీ, బేకరి, పండ్ల, పూల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో శ్రమించాల్సి ఉంటుంది. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. ఖర్చులు అధికం. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మంగళ, శనివారాల్లో బంధుమిత్రులు మీ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తారు. అవగాహన లేని విషయాలు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు, వస్త్రప్రాప్తి, వాహనయోగం వంటి శుభ ఫలితాలున్నాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. మీ ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతోను. సహోద్యోగులతోను సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోల్పోయిన వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-02-2020 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభ స్వామిని ఆరాధించినా...