Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొవ్వూరులో కంటి వెలుగు పథకం ప్రారంభం

Advertiesment
Kanti Velugu Scheme
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (05:58 IST)
రాష్ట్రంలో ముందస్తు కంటి పరీక్షలు నిర్వహించి నిరు పేదల జీవితాలలో వెలుగు లు నింపడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, తానేటి వనిత అన్నారు.

కొవ్వూరులో పండిత మదన మోహన మాలవ్య హైస్కూల్‌లో కంటి వెలుగు పథకాన్ని మంత్రి తానేటి వనిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలు లేక అనేకమంది ప్రజలు కంటి వ్యాధుల సమ స్యలతో బాధ పడుతున్నారని, ఈ పరిస్థితిని తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అర వై కోట్ల రూపాయల వ్యయంతో ఆ రు దశల్లో కంటి వెలుగు పథకాన్ని పటిష్టవంతంగా అమలు చే స్తున్నామని  మంత్రి అన్నారు.

తొలి దశ గురువారం నుండి 16వ తేదీ వరకు విద్యార్థిని, విద్యార్థులు అందరికీ ముందస్తు కంటి వైద్య పరీక్షల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పా ఠశాలల విద్యార్థులకు కంటి ప రీక్షలు చేయడం జరుగుతుందని మంత్రి  చెప్పారు.

ముందస్తు పరీక్షలు ద్వా రా 80 శాతo అంధత్వం ప్రార ద్రోలనే ఉద్దే శ్యంతో ఈ కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో చాలామందికి సరైన అవగాహన లేని కారణంగా కంటిచూపును కోల్పోతున్నారని  రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా  కోటిన్నర మంది ప్రజల కు కంటి పరీక్షలు నిర్వ హించి 80 లక్షల మందికి కేటరాక్ట్ ఇత ర చికిత్సలు నిర్వహించి అంద రికీ చూపును ప్రసాదించే విధం గా చర్యలు తీసుకుంటున్నామ న్నారు.

ప్రతిరోజూ దిన చర్యల్లో భాగంగా ఆకు కూరలు, పళ్ళు వంటి పౌష్టికాహారాన్ని తీసుకో వడం వల్ల ఎటువంటి అనారో గ్య సమస్యలు దరిచేరవన్నా రు.  ప్రజలు పోషకాహార లోపం వల్ల విటమిన్ ఎ లోపించడం వలన అంధత్వానికి గురవు తున్నారని, విటమి న్ ఏ ఆహా రాన్ని తప్పని సరిగా  తీసుకో వాల్సిన అవసరం ఉందన్నారు.

ఫోన్లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్లను అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకోవాలని, ఎ క్కువగా వాడితే దృష్టి లోపాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నా రు. ఈ సందర్భంగా డిప్యూటీ డి.ఎం. అండ్ హెచ్.వో,  డాక్టర్ జి.శైలజ మాట్లాడుతూ కొవ్వూ రు డివిజన్లో ఒక లక్షా ఎనభై వేల మంది విద్యార్థులు ఉన్నారని, కంటి పరీక్షలు నిర్వహించ డం జరుగుతుందన్నారు.

కంటి పరీక్షల నిమిత్తం 150 మంది సి బ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరి గిందన్నారు.  ప్రజలకు ఎటువం టి ఆరోగ్య సమస్యలు ఏర్పడిన ఆరోగ్య కార్యకర్తలు ఉంటారని, వారిని సంప్రదించవచ్చన్నారు.

కార్యక్రమంలో కొవ్వూరు డిఎస్‌పి కే.రాజే శ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్, టి.సుధాకర్, ఎండిఓ. పి.జగదాంబ, హెచ్ఎం. వి.గంగా భవాని, కంటమని రమేష్, బొబ్బ. సుబ్బారావు, సలాది సందీప్,ఆర్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం