Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పు చెల్లించమంటే చితక్కొట్టారు... వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం

ysrcp flag
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అప్పు చెల్లించమన్నందుకు సొంత పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీ చరణ్ కొనసాగుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న వైకాపా నాయకురాలు ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.5 కోట్లను అప్పుగా తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఇందులో రూ.90 లక్షలను ఎమ్మెల్యే తిరిగి చెల్లించారు. మిగిలిన 60 లక్షల రూపాయలను చెల్లించలేదు. ఈ డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ పదేపదే అడగసాగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్‌పై మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాటిలో మున్సిపల్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో హాట్ టాపిక్‌గా మంత్రివర్గ మార్పు