Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకినాడ కోటపై పసుపు జెండా : మేయర్ రేసులో 'ఆ నలుగురు'

కాకినాడ కోటపై పసుపు జెండా ఎగిరింది. సుమారు రెండు పుష్కరాల తర్వాత (25 యేళ్లు) కాకినాడ మున్సిపాలిటీని అధికార తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక

Advertiesment
Kakinada municipal poll results
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:11 IST)
కాకినాడ కోటపై పసుపు జెండా ఎగిరింది. సుమారు రెండు పుష్కరాల తర్వాత (25 యేళ్లు) కాకినాడ మున్సిపాలిటీని అధికార తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో టీడీపీ విజయభేరీ మోగించింది. మిత్రపక్షమైన బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ మొత్తం 48 స్థానాలకు గాను ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకుంది. 
 
దీంతో టీడీపీ టీడీపీ విజయసారథులతో పాటు.. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేసమయంలో కాకినాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి సరిపడే స్థానాలు టీడీపీకి సొంతంగానే లభించాయి. దీంతో, ఆ పదవి ఎవరు కైవసం చేసుకుంటారనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో మేయర్ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి, సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
 
కాగా, మేయర్ పీఠాన్ని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ టీడీపీ నాయకత్వం గతంలో ప్రకటించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మేయర్ పదవి కేటాయిస్తారా? లేదా? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్: ఆత్మహత్యలకు పురిగొల్పిన అడ్మిన్ అరెస్ట్..