ప్రియుడి కోసం వెళ్లి.. మూడేళ్లు వ్యభిచార రొంపిలో..?
మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. కడప జిల్లాలోని రాయచోటిలో శుక్రవారం రాత్రి పోలీసులు వ్యభిచార గృహం పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాదుకు చెందిన ఓ బాధితురాలిని రక్షించారు. హైదరాబాదుకు
మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. కడప జిల్లాలోని రాయచోటిలో శుక్రవారం రాత్రి పోలీసులు వ్యభిచార గృహం పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాదుకు చెందిన ఓ బాధితురాలిని రక్షించారు. హైదరాబాదుకు చెందిన సదరు మహిళ తాను ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం కడపకు వచ్చింది. అయితే, ఆమెకు తన ప్రేమికుడి జాడ తెలియరాలేదు. తాను అతని చేతిలో మోసపోయానని గ్రహించింది. తిరిగి ఇంటికి వెళ్లలేకపోయింది.
దీంతో భయంతో ఒంటరిగా కూర్చున్న ఆమెను పరిచయం చేసుకుని.. ప్రేమికుడి విషయంలో సహకరిస్తానని నమ్మించి రాయచోటిలోని వ్యభిచార కూపంలోకి దించేశారు. ఇలామూడేళ్ల పాటు నానా కష్టాలు అనుభవించింది. ఇక 2013లో బాధితురాలు తప్పిపోయినట్లు హైదరాబాదులోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇలా పట్టుబడిన ఆమెను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.