Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

ఠాగూర్

, గురువారం, 19 సెప్టెంబరు 2024 (13:49 IST)
గత వైకాపా ప్రభుత్వంలో నిఘా చీఫ్ అధిపతిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు... తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ఐపీఎస్ సర్వీస్ రూల్స్‌ను వైసీపీ సర్వీస్ రూల్స్‌గా మార్చివేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. ఇందులోభాగంగా, ముంబై నటి కాందబరి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేశారు. తప్పుడు కేసు బనాయించి అదుపులోకి తీసుకుని ఏకంగా 42 రోజుల పాటు కష్టడీలో ఉంచుకున్నారు. ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్టు జైత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కాదంబరి జెత్వానీ సోదరుడు అంబరీష్ జెత్వానీ దుబాయిలో స్థిరపడ్డారు. 2013 నుంచి అక్కడే ఉంటున్నారు. భారత్‌కు రెండు, మూడుసార్లే వచ్చారు. కానీ వైకాపా నేత విద్యాసాగర్ ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం స్టేషనులో ఈ యేడాది నమోదుచేసిన కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు. అంబరీష్‌పై అప్పట్లో లుకౌట్ నోటీసులు జారీచేశారు. దీనిని ఉపసంహరించాలని ఇటీవల కాదంబరీ జెత్వానీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబును కోరడంతో.. నోటీసును ఉపసంహరించారు. 
 
మరోవైపు, విద్యాసాగర్ కోసం కొనసాగుతున్న గాలింపు పరారీలో ఉన్న వైకాపా నేత విద్యాసాగర్ కోసం నగర పోలీసులు ఐదు రోజులుగా గాలిస్తున్నారు. కాదంబరి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదుచేసిన కేసులో ఆయనను ఏ1గా చేర్చారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో లుక్అవుట్ నోటీసు జారీచేయించేందుకు ప్రయత్నించారు. ఆయన పాస్‌పోర్టు గడువు 2018లోనే తీరినట్లు గుర్తించి, నోటీసు జారీని విరమించుకున్నారు. విద్యాసాగర్ దొరికితే కుట్రకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!