Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారు? జూపూడి ఫైర్

లోక్ సభలో అవిశ్వాసం పెడితే అండగా ఉంటామన్న పవన్ కల్యాణ్ ఎక్కడ పడుకున్నారంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. టీడీపీ ఎంపీల పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాసంతో కేంద్ర ప్రభుత్వాని నిలదీసిన సందర్భాలు దేశ చరిత్రలోనే లేవన్నారు. టీడీపీ ఎం

Advertiesment
అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారు? జూపూడి ఫైర్
, సోమవారం, 23 జులై 2018 (22:31 IST)
లోక్ సభలో అవిశ్వాసం పెడితే అండగా ఉంటామన్న పవన్ కల్యాణ్ ఎక్కడ పడుకున్నారంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. టీడీపీ ఎంపీల పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాసంతో కేంద్ర ప్రభుత్వాని నిలదీసిన సందర్భాలు దేశ చరిత్రలోనే లేవన్నారు. టీడీపీ ఎంపీల దూకుడు చూసి, బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ వంటి వారు నరేంద్ర మోదిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోదీది యూటర్న్ కాదా అని ప్రశ్నించారు. 
 
ప్రధాని నరేంద్రమోదికి జగన్, పవన్ జోడెద్దులుగా వ్యవహరిస్తున్నారన్నారు. బషీర్ బాగ్ సంఘటను గుర్తు చేసిన పవన్‌కు ఆ దుర్ఘటన ఎందుకు జరిగిందో కూడా తెలియదన్నారు. బషీర్ భాగ్ ఘటన వెనుక కుట్ర ఉందన్నారు. రాజకీయాలపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారన్నారు. మొన్న లోక్ సభలో తమ పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెడతారనే తెలిసే, వైఎస్ఆర్ సిపి ఎంపీలు రాజీనామా పేరుతో పారిపోయారన్నారు. సోమవారం కూడా తమ ఎంపీలు రాజ్యసభలో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారన్నారు. వైఎస్ఆర్ సిపి ఎంపీల జాడ మాత్రం కనిపించలేదన్నారు. వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదన్నారు. 
 
స్కామ్ ఇండియా... స్కీమ్ ఇండియా అని మాట్లాడిన నరేంద్రమోది నేడు నేరస్తులతో కలిసి నడుస్తున్నారన్నారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకోడానికే జగన్ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. బంద్ రూపంలో హింస చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. పవన్, జగన్ రాజకీయ బఫూన్లని, వారికి పార్లమెంట్ ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలే తెలియవన్నారు. రాజీనామా చేసిన ఎంపీలు, వైఎస్ఆర్ సిపికి చెందిన ఎమ్మెల్యేలపైనా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. మరోసారి ఓటుకోసం తమదగ్గరికి వస్తే తగిన గుణపాఠం చెబుతామంటున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ వెల్లడించారు. 
 
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రములోనూ ఇటువంటి ప్రతిపక్షంలేదన్నారు. చిరంజీవి కంటే పవన్ పైన రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. పార్టీ పెట్టకుండానే ఎంత దండుకున్నారోనని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారన్నారు. ఇది రీల్ లైఫ్ కాదని, రియల్ లైఫ్ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి అహంభావం ఉందన్నారు. ప్రపంచంలో అహంభావంతో ఉన్న నాయకులెవ్వరూ బాగుపడిన దాఖల్లాల్లేవ్ అన్నారు. ఎవరిని అడిగి జగన్ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. కేంద్రంపై రాష్ట్రం చేస్తున్న పోరాటం భాగస్వామ్యం కాకుండా సీఎం చంద్రబాబుపైనా, టీడీపీపైనా విమర్శనాస్త్రాలు చేయడం సరికాదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తేజం కోసం స్నేక్ వైన్ చేయాలనీ పాముతో అలా చేసింది... అంతే...