Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం : జేసీ ప్రభాకర్ రెడ్డి

Advertiesment
త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం : జేసీ ప్రభాకర్ రెడ్డి
, గురువారం, 11 జులై 2019 (12:34 IST)
త్వరలోనే బీజేపీ పార్టీలో తమ పార్టీ విలీనమవుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని, బిజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. 
 
ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని, ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. 
 
ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన నేపథ్యంలోజేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. జెసి బ్రదర్స్‌కు బిజెపి నుంచి ఆహ్వానం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిదండ్రులతో గొడవపడి బయటికి వచ్చేసింది.. ఆ బాలికపై ఐదుగురు, 5రోజులు..