Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా'.. జగన్‌పై జేసీ ప్రభాకర్ ధ్వజం

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా.. ఏదో నా బస్సులో

'మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా'.. జగన్‌పై జేసీ ప్రభాకర్ ధ్వజం
, ఆదివారం, 5 మార్చి 2017 (07:59 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా.. ఏదో నా బస్సులో ఫాల్టు అన్నావు. నీ దగ్గరకే వస్తా.. ఏమేమి కేసులు పెడతావో పెట్టు" అంటూ ఫైరయ్యారు. 
 
కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదాన్ని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ రాజకీయం చేస్తున్నారని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు. జేసీ సోదరులను సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 
 
తమను సీఎం ఎట్లా సేవ్‌ చేస్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీ బ్రదర్స్‌కు ఏ విధంగా సాయం చేస్తున్నారో జగన్‌ జవాబివ్వాలని డిమాండ్ చేశారు. 'మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా.. ఏదో నా బస్సులో ఫాల్టు అన్నావు. నీ దగ్గరకే వస్తా.. ఏమేమి కేసులు పెడతావో పెట్టు..' అని సవాల్‌ విసిరారు. 
 
'బస్సులో రెండో డ్రైవరే లేడని జగన్‌ అన్నాడు. ఎవడు చెప్పాడు? ప్రమాదంలో తలకు గాయమైన రెండో డ్రైవరే తాను డిక్కీలో పండుకున్నానని చెబుతున్నాడు. అసలు రెండో డ్రైవరే లేడంటే కేసయ్యేది కదా.. డిక్కీలో పండుకునే సౌకర్యం బస్సులో ఉంది. డిక్కీకి రెండు వెంటిలేటర్లున్నాయ్‌.. ఏసీ ఉంటుంది. విదేశాల్లో కూడా ఇదే పద్ధతిలో బస్సులుంటాయ్‌..     ఆ బస్సును కూడా విదేశాల నుంచే ఆరు నెలల ముందు తెప్పించాను. ఇవి తెలుసుకోకుండా మాట్లాడతావా.. ముందుగా మమ్మల్ని బస్సు ప్రమాదం నుంచి సీఎం ఎట్లా సేవ్‌ చేశాడో చెప్పు! 
 
మా నాయన కాలం నుంచీ మేం బస్సు ఓనర్లం. మా నాయన 1942లోనే బస్సు ఓనర్‌. ఆ తర్వాత ఫ్రీడం ఫైటర్‌గా జైలుకెళ్లి వచ్చి మళ్లీ బొగ్గు బస్సులు తెచ్చాడు. తరువాత నేను బస్సు ఓనర్నే. నా కొడుకు కూడా బస్సు ఓనరే. వాడు బీటెక్‌ చేశాడు. ఎంఎస్‌ లండన్‌లో చేశాడు. లా చేశాడు. అప్పట్నుంచీ ఇప్పటిదాకా మా బతుకుదెరువు అదే. మేం బతికేది దాంతోనే. మాకు బువ్వ పెట్టేది అదే. ఏం... వ్యాపారాలు చేసుకోకూడదా..? నువ్వు సూట్‌కేస్‌ కంపెనీలు పెట్టి వచ్చినావు. నీకు సైకిల్‌ కూడా లేదు.. నా కొడుకు మోటారు సైకిల్‌పై కాలేజీకి వెళ్లాడు. నీ బతుకు నాకు తెలీదా..! పోస్టుమార్టం అంటావు.. పోస్టుమార్టం ఎప్పుడు వచ్చేది? ఫోరెన్సిక్‌ రిపోర్టు వచ్చినంకే వస్తుంది. 
 
మీ నాయన.. లాస్టుకు బాడీ కూడా దొరకలేదు. కలగూరగంపగా మూటగట్టి ఇచ్చినారు. అదైనా ఆలోచించినావా.. ఏమనుకుంటున్నావు..? తండ్రి చనిపోతే బాధ ఉండాల్సింది పోయి రఘువీరారెడ్డిని అడ్డంపెట్టి సీఎం పదవి కోసం ఎమ్మెల్యేల వద్ద సంతకాలు చేయిస్తావా..? వాస్తవానికి ప్రమాదం జరిగిన బస్సుకు మేం ఓనర్లం కాదు. అయినా మా ఫ్యామిలీది కాబట్టి మేం బాధ్యత తీసుకున్నాం. నాకు కావల్సింది జవాబు.. సీఎం మమ్మల్ని ఎట్లా రక్షిస్తున్నాడో జగన్ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాది గాయత్రి మంత్రం.. వాళ్లది ప్రజాపతి గాయత్రి మంత్రం : మోదీ దాడి