Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రమాదం జరిగినప్పుడల్లా మా ఖర్మ అంటే సరిపోతుందా దివాకర్!

దివాకర్ ట్రావెల్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అతి పెద్ద బస్సు ప్రమాదాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. తెలంగాణల రెండేళ్ల క్రితం జరిగిన ఘోర బస్సు ప్రమాదమూ ఈ సంస్థ ఘనతే.

Advertiesment
Jc divakar
హైదరాబాద్ , బుధవారం, 1 మార్చి 2017 (07:45 IST)
దివాకర్ ట్రావెల్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అతి పెద్ద బస్సు ప్రమాదాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. తెలంగాణల రెండేళ్ల క్రితం జరిగిన ఘోర బస్సు ప్రమాదమూ ఈ సంస్థ ఘనతే. ఇప్పుడు ఏపీలో నందిగామ వద్ద కల్వర్ట్ కింది పడిన బస్సు ప్రమాద ఘటన కూడా ఈ సంస్థదే. కానీ ఎప్పుడు ప్రమాదం జరిగినా మా ఖర్మ అనటం దివాకర్ ట్రావెల్స్ నిర్వాహకులు జేసీ దివాకర్ సోదరులు పరిపాటిగా మారింది. 
 
మంగళవారం కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం జరగగానే జేసీ దివాకర్ సోదరులు ఇద్దరూ మీడియా సమావేశం పెట్టి మరీ పాత పాటే పాడారు. ‘‘మా ట్రావెల్స్‌లో ప్రయాణిస్తూ 11 మంది చనిపోవడం కలచివేస్తోంది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్లే ఇంత ఘోరం జరిగిందా లేక ఏదైనా జంతువు బస్సుకు అడ్డంగా రావడం వల్ల అదుపు తప్పిందా అనేది చూడాలి. మా ట్రావెల్స్‌ ఈ రోజువి కాదు. బస్సూ కొత్తదే. అయినా, ఇలా జరగడం మా కర్మ’’ అని జేసీ సోదరులు స్పందించారు. 
 
డ్రైవర్‌, క్లీనర్‌ ఇద్దరూ చనిపోవడంతో.. ప్రమాద కారణం ఏమిటనేది తెలియడం లేదని చెప్పారు. ట్రావెల్స్‌ ఎవరిదైనా ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాద ఘటనపై వారు అనంతపురం కలెక్టరేట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. 
 
‘‘ప్రమాదం వార్త వినగానే ఆవేదనకు గురయ్యాం. మా అల్లుడు ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేస్తున్నా, ఆ సంతోషం మాలో లేదు. ప్రమాదానికి గురైన బస్సు కొత్తది. ఈమధ్యనే కొనుగోలుచేశాం. ప్రమాదం జరిగిన సమయంలో 72 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది’’ అని తెలిపారు.
 
ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషాద రాగం ఆలపించడం బాగానే ఉంది తమ సంస్థ బస్సులే పదే పదే ఎందుకు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న ఆత్మ పరిశీలన జేసీ బ్రదర్స్‌కి కలగటం లేదనిపిస్తుంది. డివైడర్ ను గుద్దు కుని మరీ కల్వర్ట్ లోకి విసురుకు పడిపోయిందంటే ఆ బస్సును డ్రైవర్ ఎంత స్పీడ్‌తో నడుపుతున్నాడనుకోవాలి. 
ఇది మానవ తప్పిదమే అయితే సంస్థ నిర్వాహకులు అవలంబిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నట్లే కదా. 
 
ఇక అయినా జేసీ సోదరులు ఏడుపు మాని ప్రయాణీకుల భద్రతకు హామీ పడే మార్గాన్ని కనుగొంటే చాలా మంది ప్రాణాలుకు హామీ ఉంటుంది కదా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగదు రహితం హంబగ్.. నగదు డిమాండ్ శాశ్వతం అంటున్న స్విట్జర్లండ్