Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ పోలీసులది రాజును మించిన రాజభక్తి: రాజ్యాంగం అమలుపై జేపీ సందేహం

రాష్ట్రంలో పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తీవ్రంగా విమర్శించారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రజాస్వామ్య పాలన కోసం మనం రాసుకున్న రాజ్

Advertiesment
ఏపీ పోలీసులది రాజును మించిన రాజభక్తి: రాజ్యాంగం అమలుపై జేపీ సందేహం
హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (07:05 IST)
రాష్ట్రంలో పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తీవ్రంగా విమర్శించారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే  ప్రజాస్వామ్య పాలన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోందా అని జేపీ అనుమానం వ్యక్తం చేశారు. 
 
ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో సామాన్య వ్యక్తిని పాల్గొనకుండా అడ్డుకున్నా పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. అలాంటిది ప్రజలెన్నుకున్న మహిళా ప్రజాప్రతినిధిని ఆ సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇతరులను కించపరిచేలా ప్రవర్తించారని  ఎమ్మెల్యే రోజా కానీ, ఇంకెవరైనా కానీ అనుకుంటే న్యాయపరంగా వారిపై పరువు నష్టం దావా వేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇలాంటి పరిణామాలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, చివరికి రాష్ట్రానికే చెడ్డపేరు తెస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఇటీవల విశాఖపట్నంలో క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపడం, జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే ప్రభుత్వం అడ్డుకోవడం వంటి వరుస సంఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనే పోయాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత..! జయ వైరాగ్యమే కొంపముంచిందా?