Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాక్ ట్రీట్‌మెంట్ వెయ్యి మందికి ఇస్తే చాలు.. ప్రజలకు కాదు: జేపీ

ఐఏఎస్ పదవిని త్యాగం చేసిన రాజకీయ నాయకుడిగా మంచి పేరున్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మండిపడ్డారు. రాజకీయంగా విజయం సాధించిన సాధించకపోయినా జయప్రకాశ్, అడ్డగోలు

షాక్ ట్రీట్‌మెంట్ వెయ్యి మందికి ఇస్తే చాలు.. ప్రజలకు కాదు: జేపీ
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (09:05 IST)
ఐఏఎస్ పదవిని త్యాగం చేసిన రాజకీయ నాయకుడిగా మంచి పేరున్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మండిపడ్డారు. రాజకీయంగా విజయం సాధించిన సాధించకపోయినా జయప్రకాశ్, అడ్డగోలు విమర్శలు చేసే అలవాటు లేని జేపీ మోడీ నోట్ల రద్దు నిర్ణయంపై స్పందించారు. షాక్ ట్రీట్ మెంట్ ఈ వెయ్యి మందికి ఇస్తే చాలని.. ప్రజలకు కాదని జేపీ ఎద్దేవా చేశారు.
 
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెనుక లక్ష్యాలను మెచ్చుకుంటూనే అమలు తీరును జేపీ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలు బ్యాంకుల్లో చెల్లించిన సొమ్మును తిరిగి చెల్లించే నోట్లను ముద్రించే స్థితిలో ప్రభుత్వం లేదా అని జయప్రకాష్‌ ప్రశ్నించారు. ప్రజలు దాచుకున్న సొమ్మును సకాలంలో ఇవ్వలేకపోవడమంటే ప్రభుత్వం ప్రజల సొమ్మును దొంగతనం చేయడమే అని కామెంట్ చేశారు. 
 
విశాఖ హ్యాపీ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన లోక్‌సత్తా పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా జేపీ హాజరయ్యారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుకు లోక్‌సత్తా మద్దతు తెలుపుతుందని అయితే, తాము దాచుకున్న సొమ్మును పొందేందుకు సామాన్యులు లాఠీదెబ్బలు తినాల్సిరావడం అన్యాయమని అన్నారు. దేశ ప్రజానీకం మొత్తాన్ని తాకిందీ నోట్ల రద్దీ కార్యక్రమమని స్పష్టం చేశారు.
 
దేశంలోని 50 ఏళ్లు పైబడిన అత్యంత అవినీతి పరులైన 1000మంది అవినీతి అధికారులను, రాష్ట్రంలో వందమంది అవినీతి అధికారులను ఇంటికి పంపిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని మోడీకి జేపీ సూచించారు. ఇలా చేసేందుకు ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రకారం పూర్తి అధికారాలు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్‌సెల్వంకు పదవీగండం? తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ?