Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత పుట్టినరోజు.. రూ.2.9 కోట్ల కానుక: బ్యాంకులో జమ.. కేసు నుంచి విముక్తి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు పుట్టిన రోజు సందర్భంగా బహూకరించిన రూ.2.9 కోట్ల కానుకను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని దాఖలైన కేసు నుంచి ఊరట లభించింది.

Advertiesment
జయలలిత పుట్టినరోజు.. రూ.2.9 కోట్ల కానుక: బ్యాంకులో జమ.. కేసు నుంచి విముక్తి
, మంగళవారం, 7 మార్చి 2017 (09:45 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు పుట్టిన రోజు సందర్భంగా బహూకరించిన రూ.2.9 కోట్ల కానుకను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని దాఖలైన కేసు నుంచి ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ఆమె మరణించడంతో ఈ కేసు నుంచి ఇప్పటికే అమ్మ పేరు తొలగించబడిందని వార్తలు వస్తున్న తరుణంలో... పుట్టినరోజు కానుకను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని దాఖలైన కేసు నుంచి జయలలితను విడిపిస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1991 నుంచి 96 వరకు వ్యవహరించిన జయలలిత 1992వ సంవత్సరం తన జన్మదినాన్ని ఆడంబరంగా జరుపుకున్నారు. ఆమెకు పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు కోట్లు విలువ చేసే బహుమతులను కానుకలుగా అందజేశారు. అప్పుడు రూ.2 కోట్ల 9 లక్షల 50 వేల విలువ చెక్కును పంపిణీ చేశారు. సీఎం పదివిలో ఉన్న వ్యక్తి తనకు కానుకగా సమర్పించిన నిధిని ప్రభుత్వ ఖజానాకు అప్పగించాల్సి ఉంది. 
 
అయితే జయలలిత ఆ నిధులను తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారని 1996వ సంవత్సరం సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఏళ్ల తరబడి విచారణలో పెండింగ్‌లో ఉన్నది. ఈ కేసులో జయలలిత, అప్పటి మంత్రులుగా ఉన్న అళగు తిరునావుక్కరసు, సెంగోట్టయన్‌లను ముద్దాయిలుగా చూపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిపందిట్లోనే భర్తకు బడితపూజ చేసిన భార్య... లుథియానాలో ఘటన