Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెగిపోయిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బోగీ లింక్.. తప్పిన పెను ప్రమాదం

train

ఠాగూర్

, బుధవారం, 22 మే 2024 (10:39 IST)
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. విశాఖ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎక్స్‌ప్రెస్ బోగీ లింకు తెగిపోయింది. దీన్ని గమనించిన రైల్వే సిబ్బంది.. రైలును వెనక్కి తీసుకొచ్చి మళ్లీ లింకును తగిలించారు. విశాఖపట్టణం - లింగంపల్లిల మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. ఇది బుధవారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే ట్రైన్‌కు అటాచ్‌‍ చేసిన ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ట్రైన్ నుంచి రెండు ఏసీ బోగీలు వేరయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలెట్‌ను అప్రమత్తం చేయడంతో ట్రైన్ నిలిచిపోయింది. ఆ తర్వాత జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి విశాఖ స్టేషన్‌కు తరలించారు. ఏసీ బోగీల లింక్ తెగిపోవడానికి కారణం గుర్తించడంతో పాటు తిరిగి వాటిని లింక్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాక జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తిరిగి బయలుదేరి వెళ్లింది. 
 
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
 
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శుక్రవారానికి వాయుగుండంగా మారనుంది. తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
ఈ వాయుగుండం ప్రభావంతో బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. మంగళవారం కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
 
పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు! 
 
తెలంగాణా రాష్ట్రంలో సీసీఎస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగు చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఆయనకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఉమామహేశ్వర రావు అవినీతికి సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 
 
ఆ తర్వాత ఏసీపీ ఉమామహేశ్వర రావును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ సధీంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తామని తెలిపారు. 
 
కాగా, ఈ తనిఖీల్లో 17 ప్రాంతాల్లో ఉమామహేశ్వర రావుకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వీటిలో ఘట్‌కేసర్‌లో ఐదు ఫ్లాట్స్, శామీర్ పేటలో విల్లా గుర్తించామని చెప్పారు. ఏసీపీ ఉమామహేశ్వర రావుకు చెందిన రెండు లాకర్లు గుర్తించామని వెల్లడించారు. రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు మార్కెటి విలువ ప్రకారం రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో వర్షాలు