బలోపేతం దిశగా జనసేన పార్టీ...(వీడియో)
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా దూసుకెళుతోంది. పార్టీని ఆషామాషీగా కాకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టపరిచి ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ మొదటగా పార్లమెంటు స్థాయ
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా దూసుకెళుతోంది. పార్టీని ఆషామాషీగా కాకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టపరిచి ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ మొదటగా పార్లమెంటు స్థాయిలో సమన్వయకర్తలను తీసుకునే పనిలోపడ్డారు.
తిరుపతిలో జనసేన పార్టీ సమన్వయకర్తల నియామకం ప్రారంభమైంది. జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికసంఖ్యలో యువతీయువకులు నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 6వ తేదీన శ్రీకాకుళంలో సమన్వయకర్తల నియామకాన్ని ప్రారంభించామని హరిప్రసాద్ తెలిపారు.
ఒక్కొక్క పార్లమెంటు నుంచి 840 మందిని తొలివిడతగా తీసుకోనున్నామని, పార్టీ పటిష్టతకు, ప్రజాసేవ చేసే వారికి జనసేనలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే 25 సెగ్మెంట్‌లలో సమన్వయకర్తల నియామకం పూర్తయిందనీ, మరో 7 సెగ్మెంట్లలో డిసెంబర్ 7వ తేదీన నమోదు పక్రియను పూర్తిచేస్తామన్నారు. డిసెంబర్ చివరినాటికి ఎన్నికైన వారికి పవన్ కళ్యాణ్ శిక్షణ ఇవ్వనున్నట్లు హరిప్రసాద్ చెప్పారు.