భాజపాకు 5 ప్రశ్నలు.... సమాధానం చెప్పాల్సిందే... పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపా ముందు 5 ప్రశ్నలు ఉంచారు. తను భాజపా తరపున కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు కర్నాటకలోనూ ప్రచారం చేశాననీ, అందువల్ల కొన్ని ప్రశ్నలకు భాజపా తప్పక సమాధానమివ్వాలన్నారు.

ముఖ్యంగా గోవధ గురించి తెగ ప్రచారం చేస్తున్న భాజపా ముందుగా దాన్ని వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో నిషేధం విధించాలన్నారు. ఇంకా భాజపాకు చెందిన నాయకులంతా గోవుల చర్మపు బెల్టులు, చెప్పులు వేసుకోకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ధరించాలని సూచించారు. ఇవన్నీ వారు చేయకుండా ప్రకటనలు ఎందుకంటూ విమర్శించారు.
భాజపా ముందు తను సంధిస్తున్న 5 ప్రశ్నల్లో...
1. గోవధ
2. రోహిత్ వేముల ఆత్మహత్య గురించి
3. దేశభక్తి
4. నోట్ల రద్దు
5. ఏపీ ప్రత్యేక హోదా ఉన్నాయి. ఈ అంశాల పైన మరింత వివరంగా రేపు ట్విట్టర్లో స్పందిస్తానని వెల్లడించారు.