Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొత్తుపై ములాఖత్‌కు ముందే పవన్ నిర్ణయం ... ఇంత హఠాత్తుగానా అంటూ బాబు ప్రశ్న...

pawan kalyan
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (15:49 IST)
తప్పుడు కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని చూడగానే జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనతో మనోవేదనకు గురయ్యారు. మీ స్థాయి వ్యక్తులకు కూడా ఇలాంటి పరిస్థితి తీసుకురావడం దుర్మార్గానికి పరాకాష్ట. మిమ్మల్ని ఇలాంటి చోట చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని పవన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 
 
గురువారం ఆయన రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును కలిసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వారి మధ్య కీలక చర్చలు జరిగాయి. టీడీపీ - జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ అప్పటికప్పుడే చంద్రబాబుకు సమాచారం ఇవ్వడం, ఆయన కూడా అంగీకరించడం జరిగిపోయింది. పొత్తుపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం నెలకొంది. ఎన్నికలు ఇప్పట్లో లేనందున... అధికారిక ప్రకటనపై మాత్రమే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. 
 
తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై సత్వరం స్పష్టత ఇచ్చేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చారు. అందుకే ములాఖత్‌లో చంద్రబాబును చూడగానే, ఎలా ఉన్నారు.. ఆరోగ్యం ఎలా ఉందని పవన్ అడిగారు. బాగానే ఉన్నానని చంద్రబాబు బదులిచ్చారు. తర్వాత వారి మధ్య వైసీపీ ప్రభుత్వ అణచివేత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలపై కొంత చర్చ జరిగింది. 
 
ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పొత్తుపై బహిరంగ ప్రకటన చేద్దామని నిర్ణయించుకునే ఇక్కడికి వచ్చానని పవన్ చెప్పగా, 'ఇప్పుడేనా, ఇంత హఠాత్తుగానా' అని చంద్రబాబు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'నావైపు నుంచి నేను నిర్ణయం తీసుకునే వచ్చాను. మీకేమైనా అభ్యంతరమా' అని పవన్ స్పష్టం చేశారు. 'ఆన్నీ ఆలోచించుకుని వస్తే ఓకే! పొత్తుపై ప్రకటన చేసేయవచ్చు' అని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
అదేసమయంలో 'నీ అభిప్రాయం ఏమిటి' అని లోకేశ్‌ను బాబు ప్రశ్నిం చారు. 'మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే' అని లోకేశ్‌తో పాటు బాలకృష్ణ కూడా చెప్పారు. దీంతోపాటు ఉమ్మడి కార్యా చరణ ఎలా ఉండాలనే అంశంపైనా వారందరిమధ్య స్వల్ప చర్చ జరిగింది. అంతా ఒక నిర్ణయానికి రావడంతో.. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తుపై పవన్ విస్పష్టమైన ప్రకటన చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో తొలిసారి.. తిరుపతిలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు వచ్చేసింది..