జనసేన దూకుడు-హైదరాబాద్, ఉత్తరాంధ్ర నుంచి ఎంపిక ప్రక్రియ- పవన్ ప్రకటన
ముందస్తు ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. హైదరాబాద్, ఉత్తరాంధ్రలలో జనసేన ఎంపిక కోసం ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన
ముందస్తు ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. హైదరాబాద్, ఉత్తరాంధ్రలలో జనసేన ఎంపిక కోసం ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ఈసారి హైదరాబాద్, ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఇంకా జనసేన విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే? ఈసారి ఎంపిక ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించాము. అనంతపురం జిల్లాలో జరిపిన ఎంపికలను జయప్రదం చేసినందుకు ఆ జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటనలో వెల్లడించారు. జనసేన తరపున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనేవారిని గుర్తించడానికి మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ పోటీ పరీక్ష కాదని ముందే చెప్పామని, ఇది ప్రతిభను, శక్తియుక్తులను గుర్తించే ప్రక్రియ మాత్రమేనని పవన్ తెలిపారు.
స్పీకర్, అనలిస్ట్-కంటెంట్ రైటర్ విభాగాలకు ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపవచ్చు. దరఖాస్తులు పంపి ఆన్ లైన్ యూఆర్ఎల్‌లను కూడా ఈ లేఖలో పవన్ పొందుపరిచారు. దరఖాస్తులను 06.05.2017 నుంచి 13.05.2017 రాత్రి 8 వరకు ఆన్‌లైన్‌లో పంపవచ్చు. ఈ రాజకీయ యజ్ఞంలో పాల్గొనదలచిన జన సైనికులకు, అభిమానులకు, యువతీ, యువకులకు, మేధావులు ఈ సందర్భంగా నా శుభాభినందనలు అంటూ పవన్ తెలిపారు. ఇకపోతే, యూఆర్ఎల్స్ కోసం జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను సంప్రదించవచ్చు.