తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ప్రజలు చాలా మేరకు తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇక్కడ తమిళ ప్రజల సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ పోటీలను అధికార పార్టీ నేతల అండతే యధేచ్చగా నిర్వహించారు. ముఖ్యగా, పశువుల పండుగ అయిన కనుమ పండుగ రోజున చిత్తూరు జిల్లాతోపాటు పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన వారితోపాటు వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
వీరంతా యధేచ్చగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ పోటీల్లో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఈ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుండుపల్లిలో కూడా ఈ జల్లికట్టు పోటీలు జరిగాయి.