Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెల్లంపల్లి అవినీతి చరిత్ర గురించి చెబితే పుస్తకాలకు పుస్తకాలే ఉంటుంది: జలీల్ ఖాన్

Advertiesment
Jalil khan
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:46 IST)
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు దేవుళ్లన్నా, గురువులన్నా గౌరవంలేదని, పెద్దవాడైన చంద్రబాబునాయుడిని ఏకవచనంతో సంబోధించడం అతనిలోని కుసంస్కారానికి నిదర్శనమని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి చెందిన 7వేల ఎకరాలను జగన్ అమ్మేస్తానంటే, ఆ భూములు అమ్మే అధికారం, హక్కు జగన్ కు ఎక్కడివని టీడీపీ అధినేత ప్రశ్నిస్తే, సిగ్గులేకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన్ని తప్పుపడుతున్నాడన్నారు. ఎవరో ఇచ్చిన భూములనుఅమ్మేసే హక్కు, జగన్ కి, వెల్లంపల్లికి ఎక్కడినుంచి వస్తుందన్నారు.

జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించిందే భూములు అమ్మకోవడానికని జలీల్ ఖాన్ తేల్చిచెప్పారు. బచ్చా అయిన వెల్లంపల్లి చంద్రబాబుపై విమర్శలు  చేయడమే పెద్దపొరపాటన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పనిచేసే అధికారులను మార్చినతరువాత, దేవాలయాల్లోని హుండీలకన్నా వెల్లంపల్లి హుండీనే ఎక్కువగా నిండుతోందన్నారు .

ఎన్నికలముందు వెల్లంపంల్లి ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో ప్రజలే గమనించాలన్నారు. దేవాదాయశాఖా మంత్రి అంటే ప్రజలంతా గౌరవిస్తారని, అటువంటి గౌరవం పొందే అర్హత ఏమాత్రం లేని వ్యక్తి వెల్లంపల్లి అన్నారు. గతంలో గెలిచినప్పుడు, వెల్లంపల్లి శ్రీనివాస్ నావద్దకు వచ్చి, అన్నా నీదయవల్లే గెలిచానం టూ చెప్పడం జరిగిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఎలాంటివాడో, వెల్లంపల్లికంటే తనకే బాగా తెలుసునన్న జలీల్ ఖాన్,  శ్రీనివాస్ ప్లేటు జగన్ చేతిలో ఏదోఒకరోజు తిరగబడటం ఖాయమన్నారు. ఇప్పుడేదో కార్పొరేషన్ ఎన్నికల్లో వెల్లంపల్లి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ,  వాటిలో అధికారపార్టీ వారు గెలవకపోతే, జగన్ చేతిలో శ్రీనివాస్ కు ఎలాంటి పరాభవం ఎదురవుతుందో మాటల్లో చెప్పలేమన్నారు.

దుర్గమ్మసన్నిధిలోని స్క్రాప్ ని రూ. 15లక్షలకు వెల్లంపల్లి అమ్మేసుకున్నాడని, దానివిలువ దాదాపు రూ.కోటి50లక్షలవరకు ఉంటుందని జలీల్ ఖాన్ తెలిపారు. అమ్మకాలకు సంబంధించి మంత్రి ఎటువంటి టెండర్లు పిలవలేదన్నారు.  దేవాలయాల్లో ఈవోలను మార్చినందు కు వారినుంచి కూడా డబ్బులు వసూలుచేశాడన్నారు.

ఈ విధంగా వెల్లంపల్లి చరిత్ర గురించి చెబితే, పుస్తకాలకు పుస్తకాలే ఉంటాయ న్నారు.  వైసీపీలో ఉన్నప్పుడు ఆపార్టీకోసం తాను ఎంతో కష్టపడ్డా నన్న జలీల్ ఖాన్, ఆతరువాత జగన్మోహన్ రెడ్డి పనితీరుచూసి విసిగిపోయి, నియోజకవర్గఅభివృద్ధికోసం టీడీపీలోకి రావడం జరిగిందన్నారు. వెల్లంపల్లి తన వర్గానికి కూడా న్యాయంచేయలేద ని, అందుకే గతఎన్నికల్లో అతని వర్గంవారంతా తనకు ఓట్లేశారని జలీల్ ఖాన్ చెప్పారు.

వెల్లంపల్లిని చూస్తుంటే, ఎక్కడా మంత్రిలా కనిపించడని, అతన్ని చూస్తుంటే బఫూన్ లా కనిపిస్తాడన్నారు.  గెలుపుఓటములు అనేవి సహజమని, వైసీపీప్రభుత్వం వచ్చాక విజయవాడలో చేసిన అభివృద్ధేమిటో వెల్లంపల్లి చెప్పాలన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్లు, రోడ్లు వేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు 

కేవలం పబ్లిసిటీ పిచ్చితోనే ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. రేషన పంపిణీకి ఉపయోగిస్తున్న ఆటోల యజమానులకు ప్రభుత్వం డబ్బులిస్తోందని, వాటిని నడిపే డ్రైవర్లు మాత్రం చాలీచాలనీజీతంతో గగ్గోలు పెడుతున్నారన్నారు.  విజయవాడ నగరంలో 20, 30ఏళ్లనుంచి బతుకుతున్నవారికి ఈ ప్రభుత్వం ఎక్కడోగన్నవరం, మైలవరం సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చిందన్నారు.

పనికిరాని స్థలాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ జనాన్ని మోసగించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆస్థలాల్లో ఇళ్లు కడతామంటూ, మరోకొత్త మోసానికి జగన్ ప్రభుత్వం తెరలే పబోతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకధర ఎంతఉందో, ఇప్పుడెంత ఉందో వెల్లంపల్లికి తెలియదా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. అమ్మఒడి సహా అనేకపథకాలు జగన్ దోపిడీకోసం సృష్టించినవేనన్నారు.

అటు కేంద్రాన్ని ఒప్పించి, రాష్ట్రానికి నిధులు తీసుకురావడం చేతగాని జగన్, రూ.2లక్షలకోట్ల వరకు అప్పులభారాన్ని రాష్ట్రంపై వేశాడన్నారు. వెల్లంపల్లి మంత్రి అయినప్పటినుంచీ దేవాలయాలపై దాడులు, విగ్రహాలధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.  ప్రజల గురించి ఆలోచించకుండా, ఉదయం లేచినదగ్గరనుంచీ టీడీపీపై నిందలేయడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.

బెల్లంముక్క అనే అధికారం వైసీపీచేతలో ఉందికాబట్టే, ఆపార్టీ కార్యకర్తలు, ప్రజలు వారిచుట్టూ తిరుగుతున్నారన్నారు.  పోలీసులు లేకుండా వైసీపీనేతల, మంత్రుల ప్రజల్లోకి వెళితే, ప్రజలు వారిని కుక్కలనుకొట్టినట్లు కొడతారని జలీల్ ఖాన్ మండిపడ్డారు.  ఈ ప్రభుత్వంలో పేదల పరిస్థితి చాలాదారుణంగా ఉందని, అన్నివస్తువులు, నిత్యావసరాల పై ధరలు పెంచి, ప్రజాజీవనాన్ని జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బ తీసిందన్నారు.

జగన్ కు దమ్ము, ధైర్యముంటే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. స్థానిక ఎన్నికలు అయిపోయాక పోలీసుల తీరుపై నిరసనవ్యక్తంచేస్తూ జైల్ భరో కార్యక్రమం నిర్వహించేఆలోచనలో ఉన్నానని జలీల్ ఖాన్ తెలిపా రు. దేవాదాయశాఖమంత్రిగా పనిచేసినవారెవరూ తిరిగి రాజకీయాల్లో కొనసాగలేదని, వెల్లంపల్లికి దమ్ముంటే, టీడీపీ ప్రభు త్వం ఎక్కడ విగ్రహాలు తొలగించిందో ఆధారాలుచూపాలన్నారు.

వెల్లంపల్లిని మంత్రిగా గౌరవించలేనని, అతని పనితీరు, చర్యలు చూస్తే, నాకు అలా అనిపించడంలేదన్నారు.  విజయవాడ ఎంపీగా వైసీపీతరుపున పోటీచేసిన వ్యక్తి, వెల్లంపల్లి డబ్బులుతీసుకొని తనను మోసగించాడని చెప్పాడన్నారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉండి దోపిడీలు, విగ్రహాల ధ్వంసాలు, దేవాలయాలపై దాడులు చేయించడం వెల్లంపల్లికే చెల్లిందన్నారు.

టీడీపీ ప్రభుత్వం దసరా పండుగను రాష్ట్రపండుగగా ఘనంగా నిర్వహిస్తే, వెల్లంపల్లి అమ్మవారి దేవాలయంలోని ప్రతివస్తువుని అమ్ముకోవడానికే ప్రాధాన్యమిస్తున్నాడన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా శ్రీనివాస్ ను ఎందుకు గెలిపించామా అని ఇప్పుడు బాధ పడుతున్నారన్నారు. వెల్లంపల్లి నిర్వాకాలకు సంబంధించి తనవద్ద ఆధారాలున్నాయని, మీడియావారు వస్తే, అవిచూపడానికి సిద్ధం గా ఉన్నానన్నారు.

జగన్ పాలనచూస్తే నవ్వొస్తోందని, రాష్ట్ర రాజధాని ఏదని చదువుకునే విద్యార్థులను అడిగితే, ముఖ్యమంత్రి మూడురాజధానులను ప్రకటించాడు, వాటిలో ఏది రాజధానో తమకు తెలియదనే పరిస్థితిలో ఉన్నారన్నారు. టీడీపీప్రభుత్వం వస్తే, విజయవాడలోని శ్రీనివాస్ మహల్ నుంచి సొరంగంద్వారా రోడ్డు మార్గం వేయిస్తానని చంద్రబాబుహామీ ఇచ్చారు. 

ప్రతిపక్షం ఇచ్చినహామీని నెరవేర్చే ఆలోచన వెల్లంపల్లికి ఉందా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. జగన్ ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా, మూడు ప్లేట్లపైఆధారపడతాడని, ఒక ప్లేట్ విజయసాయిరెడ్డి అయితే, మరోప్లేట్ సజ్జల రామకృష్ణారెడ్డి అని, మూడో ప్లేట్ జగన్ అన్నారు. ఆమూడు ప్లేట్లలో ఏదితిరగబడినా వైసీపీఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మూడుతుందన్నారు.

పట్టణాలు, నగరాల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు భయపడరని, పోలీసులకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసునన్నారు.  మున్సిపల్  కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతికేంద్రంగా జరిగే నిర్మాణపనుల్లో దాదాపు లక్షమందికి పైగా కార్మికులు ఉండేవారని, ఇప్పుడు ఆప్రాంతాన్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు.

రాష్ట్రప్రజల కర్మకొద్దీ జగన్ ముఖ్య మంత్రయ్యాడన్నారు. తాను క్రియాశీలరాజకీయాల్లో లేననేది అవాస్తవమన్న జలీల్ ఖాన్, కార్పొరేషన్ ఎన్నికల్లో తనసత్తా ఏమిటో చూపడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తొలిసారి ఎమ్మెల్యే గా వెల్లంపల్లి గెలిచినప్పుడు, దర్గాస్థలంఆక్రమించాడని,  తనకు తెలిస్తే ఊరుకోనని, వెంటనే దాన్ని వేరేవారికి అమ్మేశాడన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో అధికారపార్టీ కార్యకర్తలకే న్యాయం జరగడం లేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి తన అనుచరులకు అప్పగించాడన్నారు. వారిద్దరూ ముఖ్యమంత్రుల లెవల్లో ఫీలవుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య..