Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విభజిస్తే కాంగ్రెస్‌కు ప్రయోజనం ఉంటుందని ఆజాద్ చెప్పారు... అందుకే ముక్కలు చేశాం: జైరాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాలపై మంచి అవగాహన కలిగిన నాటి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌.. విభజన వల్లే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అధిష్టానాన్ని ఒప్పించడంలో విజయం సాధించారని ఆ పార్టీ రాజ్యసభ

విభజిస్తే కాంగ్రెస్‌కు ప్రయోజనం ఉంటుందని ఆజాద్ చెప్పారు... అందుకే ముక్కలు చేశాం: జైరాం
, సోమవారం, 13 జూన్ 2016 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాలపై మంచి అవగాహన కలిగిన నాటి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌.. విభజన వల్లే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అధిష్టానాన్ని ఒప్పించడంలో విజయం సాధించారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. అందుకే ఏపీని ముక్కలు చేసినట్టు చెప్పారు. 
 
రాష్ట్ర విభజన జరిగాక ఇక ఆ చాప్టర్‌తో తెలంగాణ వాదులకూ సీమాంధ్ర నేతలకూ అవసరమే లేకుండా పొయింది. ఇప్పుడు ఆ చాప్టర్‌ను బహిర్గతం చేసినా ఎలాంటి ప్రభావమూ ఉండదని జైరాం రమేశ్‌ భావించి విడుదల చేశారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 8 చాప్టర్లు ఉన్నాయి. వాటిలో ఏడింటిని బహిర్గతం చేశారు. ఎనిమిదో అధ్యాయాన్ని మాత్రం బయటపెట్టలేదు. 
 
దాన్ని ఎందుకు వెల్లడించడం లేదంటూ ఆందోళనలు కూడా జరిగాయి. ఈ ఆప్షన్‌ రాష్ట్ర విభజనకు అడ్డంకిగా మారుతుందని తెలంగాణవాదులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఆ చాప్టర్‌ను బహిర్గతం చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడిని పెంచారు. కానీ ఆ చాప్టర్‌ గురించిన వివరాలన్నీ రహస్యంగానే ఉన్నాయి. ఇపుడు ఆయన ఇపుడు వెల్లడించారు. 
 
'తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంతర్గత భద్రతకు ముప్పువాటిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నక్సల్స్‌ను తీవ్రస్థాయిలో అణగదొక్కింది. నక్సల్స్‌ ఉనికినే లేనంతగా కట్టడి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్‌ చర్యలు మళ్లీ పెరిగిపోతాయన్న ఆందోళన పోలీసు వర్గాల్లో కన్పించింది. ఈ నక్సల్‌ ప్రభావం ప్రభుత్వాన్ని అస్థిర పరచేలా ఉంటుందని పోలీసు ఉన్నతాధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయని చెప్పుకొచ్చారు. పైగా, అంతర్గత భద్రత కారణాల దృష్ట్యా ఈ అంశాన్ని రహస్యంగా ఉంచాలని కోరినందునే .. దీనిని రహస్య చాప్టర్‌గానే ఉంచేశామని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో ఉన్నామా? ముద్రగడ విషయంలో కసబ్ కంటే దారుణంగా?: అంబటి