Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజ‌య‌పురంలో జ‌గ‌న‌న్న ఇళ్ళ‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజ‌మ్మ‌

Advertiesment
విజ‌య‌పురంలో జ‌గ‌న‌న్న ఇళ్ళ‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజ‌మ్మ‌
విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:14 IST)
వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన జ‌గ‌న‌న్న కాల‌నీలు ఎమ్మెల్యే రోజా నియోజ‌క‌వ‌ర్గంలో త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్త‌వుతున్నాయి. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో గృహ నిర్మాణాలు స్పీడందుకున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల వ‌ర్షాల వ‌ల్ల‌, ఇత‌ర ఇబ్బందుల వ‌ల్ల జ‌గ‌న‌న్న ఇళ్ళు నిర్మాణంలో చాలా వెనుక బ‌డ్డాయి. కానీ, ఎమ్మెల్యే రోజా నియోజ‌క‌వ‌ర్గంల న‌గ‌రిలో మాత్రం పూర్త‌యి, గృహ‌ప్ర‌వేశాలు కూడా జ‌రిగిపోతున్నాయి. ఆ జ‌గ‌న‌న్న ఇళ్ళ ఎదుట‌, ల‌బ్ధిదారుల‌తో ఎమ్మెల్యే రోజ‌మ్మ ఎంచ‌క్కా ఫోటోలు దిగుతున్నారు.
 
న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం విజయపురం మండలం విజయపురం పంచాయతీలో జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహాలను ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రారంభించారు. ఆమె చ‌క్క‌గా ల‌బ్ధిదారుల‌ను త‌న ప‌క్క‌న ఫోటో దిగ‌మ‌ని సూచిస్తున్నారు. ఇలా దిగిన ఫోటోలు ఫేస్ బుక్ ల‌లో జ‌గ‌న‌న్న కాల‌నీలు స‌క్సెస్ అని పోస్ట్ చేస్తున్నారు. విజ‌య‌పురం కాల‌నీలో ఎమ్మెల్యే రోజా ప‌లు ఇళ్ళ‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ స్పెషలాఫీసర్ రత్నాకర్ రెడ్డి, హౌసింగ్ డిఇఇ, ఎఇ,  లబ్ధిదారులు, స‌ర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్య ప్రయాణికుడిగా ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్