Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

180 రోజులు.. 3 వేల కిలోమీటర్లు : 'ప్రజా సంకల్పం' పేరుతో జగన్ పాదయాత్ర

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేయనున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి చేపట్టే ఈ పాదయాత్రకు 'ప్రజా సంకల్పం' అనే పేరు పెట్టారు.

180 రోజులు.. 3 వేల కిలోమీటర్లు : 'ప్రజా సంకల్పం' పేరుతో జగన్ పాదయాత్ర
, శుక్రవారం, 27 అక్టోబరు 2017 (12:24 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేయనున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి చేపట్టే ఈ పాదయాత్రకు 'ప్రజా సంకల్పం' అనే పేరు పెట్టారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగే ఇది సాగనుంది. ఈ పాదయాత్ర 180 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలు, 10 వేల నివాసిత ప్రాంతాలు, గ్రామాల్లో సాగనుంది. మొత్తం 180 రోజుల్లో 125 బహిరంగ సభలు నిర్వహిస్తారు. 
 
పాదయాత్రలో జగన్ ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకూ కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకూ పాదయాత్ర నిర్వహిస్తారు. 12:30 గంటల నుంచి 3 గంటల వరకూ భోజన విరామ సమయం ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల వరకూ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. 3:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. జగన్ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌కు సంబంధించిన వివరాలను పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు.
 
ఓవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర కొనసాగుతుంటే.. మరోవైపు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అసెంబ్లీ కో-ఆర్డినేట‌ర్లు, ఎమ్మెల్యేలు, నాలుగు నెల‌ల పాటు చేప‌ట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ కార్యాచరణ ప్రకటించారు. ప్రధానంగా రచ్చబండ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ సూచించారు. ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారించడంతోపాటు పార్టీని అన్ని వర్గాల ప్రజల్లోని తీసుకెళ్లాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు సంతకాల సేకరణతోపాటు.. కళాశాల విద్యార్ధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ నేతలకు జగన్ అప్పగించిన కార్యాచరణపై సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రతో జగన్.. పాదయాత్ర సిద్ధం చేసుకున్నారు. జగన్ చేపట్టబోయే పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉ.కొరియా కంటే పాక్‌తో ప్రపంచానికే ముప్పు : యూఎస్ మాజీ సెనేటర్