Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్లకాలం చంద్రబాబు సర్కార్ సాగదన్న జగన్.. పులివెందుల రౌడీయిజం చేయొద్దు పాముకు పాలు పోస్తే?

పోలీసులకు ఒక్కటే చెబుతున్నా.. ఎల్లకాలం చంద్రబాబు సర్కార్ సాగదు.. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలకు అండగా నిలబడండి అని రాష్ట్ర పోలీసులకు వైకాపా అధినేత జగన్ సూచించారు. విశాఖ ఎయిర్‌‌పోర్టులో పోలీసులు

Advertiesment
Jaganmohan Reddy protests at Vizag airport after being denied entry into city
, శుక్రవారం, 27 జనవరి 2017 (09:21 IST)
పోలీసులకు ఒక్కటే చెబుతున్నా.. ఎల్లకాలం చంద్రబాబు సర్కార్ సాగదు.. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలకు అండగా నిలబడండి అని రాష్ట్ర పోలీసులకు వైకాపా అధినేత జగన్ సూచించారు. విశాఖ ఎయిర్‌‌పోర్టులో పోలీసులు వ్యవహరించిన తీరుపై జగన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విద్యార్థుల నుంచి నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు, 
 
రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆరాట పడుతున్న వారిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సర్కార్‌‌ను జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్ అంటే వారిలో పోలీసుల పిల్లలు కూడా ఉంటారు ఆ విషయం గుర్తు పెట్టుకోండన్నారు. "చంద్రబాబుకు చెందిన కొందరు పోలీసులు మిస్ బిహేవ్ చేస్తున్నారన్నారు. 
 
చదువుకుంటున్న పిల్లలపై సైతం కేసులు పెడతారా అంటూ ఖాకీలపై కన్నెర్రజేశారు జగన్. పిల్లలూ మీరు కేసుల గురించి బయపడకండి మన ప్రభుత్వం.. మనందరి ప్రభుత్వం వస్తుంది.. పెట్టిన ప్రతి కేసు తీసేస్తానంటూ యువతకు జగన్ మీడియా ద్వారా చెప్పారు. చంద్రబాబునాయుడు లాంటి వారు అప్పుడు ఉంటే బహుశా స్వాతంత్రం వచ్చేది కాదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు హోదా కోసం జరుగుతున్న ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విపక్ష నేత జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా ముసుగులో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖలో పులివెందుల రౌడీయీజం చేస్తే కఠినచర్యలు తప్పవని అన్నారు. పాముకు పాలు పోస్తే కాటేస్తుందని, ఏది మంచో, ఏది చెడో యువత జాగ్రత్తగా ఆలోచించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముస్లింలను రాజకీయ పార్టీలు కండోమ్స్‌లా వాడుకుంటున్నాయ్: అబూ అజ్మీ