Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసుల మాఫీ కోసమే మోడీ కాళ్ళకు జగన్ సలాం: నారాయణ

కేసుల మాఫీ కోసమే మోడీ కాళ్ళకు జగన్ సలాం: నారాయణ
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:52 IST)
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ స్థానిక నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి సిఎం జగన్ ప్రధాని మోడీ కాళ్ళుకు సలాం చేస్తున్నారని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర పాలన పై వ్యతిరేఖంగా ప్రజలు, రైతులు కోసం అందోళనలు చేస్తుంటే ,కోవిడ్ ను చూపి అడ్డుకుంటున్నారని ,కోవిడ్ నెపంతో సిఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అనుచిత పాలన పై ఆందోళన చేస్తే చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారని అంటూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కోన్నారు.

అప్పట్లో అమరావతిని అఖిల పక్షాలు ఆమోదించాయి ,ఇప్పుడు వైకాపా అమరావతి వద్ధంటే రైతులకు మద్ధతుగా నిలవకూడదా అంటూ ప్రశ్నించారు.

గతంలో ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వేస్తే 75ఆర్టికల్ ప్రకారం ఎన్నికలు జరపకపోతే నిధులు రావన్న ప్రభుత్వం ,నేడు ఎన్నికల వాయిదాకు పోవడం విడ్డురంగా ఉందన్నారు.

గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి మొదటినుంచి ఎన్నికల ప్రక్రియ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. చంద్రబాబు ,సిఎం జగన్ లు ఇక్కడేమో మోడీ డౌన్ డౌన్ అంటూ అక్కడకు వెళ్ళి మోడీ కి మద్ధతు తెలపడం దురదృష్టకరమన్నారు.
 
సిఎం జగన్ దొంగాటలు మానుకుని  ప్రజాపక్షాన నిలబడితే మంచిదన్నారు. ప్రధాని మోడీ దేశ సంపదను కార్ఫోరేట్ పరం చేయాలని చూస్తున్నారు.

దేశానికి రైతులే వెన్నుముక ,రైతులకు బేడీలు వేసి ,రైతుల పంటలను కొనుగోలు చేసేలా రిలయన్స్ తో 90వేల కోట్లతో భేరం కుదుర్చుకోవడం సమంజసం కాదన్నారు.

బీహార్ ఎన్నికలులో చైనా,పాకిస్థాన్ వివాదం,మధ్యప్రదేశ్ ఎన్నికలలో పూల్వామా వివాదంను అడ్డుపెట్టుకుని మోడీ సానుభూతి రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
 
జగన్ లోపాయకార రాజకీయాలను మానుకుని కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్ టీ బకాయిలు నాలుగువేల కోట్లు, పోలవరం నిధులు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై దృష్టి పెట్టి పోరాడాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర పండుగ‌గా మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతి