Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం ధరలతో పేద కుటుంబాలను దోచుకుంటున్న జగన్ : టిడిపి

మద్యం ధరలతో పేద కుటుంబాలను దోచుకుంటున్న జగన్ : టిడిపి
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:39 IST)
రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలు పెంచి ఇష్టానుసారంగా దోచుకుంటూ పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికి పోవడానికి కారకులు అవుతున్నారని నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మద్యం అధిక ధరలతో రోజువారి కూలీల కుటుంబాల జీవనం కష్టతరంగా మారింది అన్నారు. చంద్రబాబు పాలనలో నాణ్యమైన లిక్కర్ క్వార్టర్ బాటిల్ ₹60 అందుబాటులో ఉంటే నేడు జగన్ రెడ్డి పాలనలో బినామీ కంపెనీల ఏర్పాటు చేసి 50 రూపాయలు లిక్కర్ బాటిల్ ను 160 రూపాయలు అమ్ముతూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు.

మద్యం పాలసీ తో ఆరు వేల కోట్లు ప్రభుత్వ ధనం జగన్ రెడ్డి కంపెనీలకు వెళుతున్నాయని, 5వేల కోట్లను కమీషన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి రాబడితో ఐదేళ్లలో 25 వేల కోట్లు ప్యాలెస్ చేస్తున్నాయని విమర్శించారు. జె టాక్స్ కోసం నకిలీ మద్యం బ్రాండ్లను తెచ్చి వేల కోట్ల అక్రమ సంపాదన ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం నేడు నాలుగు నెలలు మద్యం షాపు మూసేసి కరోనా ప్రభావం తగ్గక ముందే మద్యం షాపులు తెరిపించి ఉపాధ్యాయులతో అమిచిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఏపీలో మద్యం లో వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు గా చూపి గత పదిహేనేళ్ల పాటు 5 వేల కోట్ల అప్పు తెచ్చారని, నేడు మిగిలిన డిపోల మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరో 25 వేల కోట్లు అప్పులు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. మద్యం పాలసీ లో వైసీపీ నేతలు 670 కోట్ల కుంభకోణం చేశారని ఘాటుగా విమర్శించారు. 8000 కూడా అద్దె పలకని షాపులకు 80 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నేతల కట్టబెట్టారని విమర్శించారు.

మద్యానికి బానిసైన వ్యక్తులు రేట్లు పెరిగిన మద్యాన్ని కొనలేక స్పిరిట్, శానిటైజర్ లు తాగి  50 మంది నాటుసారా కల్తీ మద్యం సేవించి మరి కొందరు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పలుచోట్ల వైసిపి నాయకులు కార్యకర్తలు నాటు సారా తయారు చేయించి అధిక ధరలకు అమ్ముతున్న ఘటనలు చవిచూశామని వివరించారు. మద్యం రేట్లు పెంచితే తాగే వ్యక్తులు సంఖ్య తగదంటూ ప్రజల్ని మోసం చేసి  j.tax ద్వారా సొంతం చేసుకున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో లో మన సాగుతున్న మద్యం అధిక ధరలతో పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి నిలుపుకోవాలని జీవీ ఆంజనేయులు హితవుపలికారు. మద్యపాన నిషేధంపై జగన్ రెడ్డి మాట తప్పి మహిళలకు అన్యాయం చేయడం దుర్మార్గమని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలకు టిడిపి అండగా ఉండి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఇదే.. 11మందితో సర్కారు