Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని: బిసి సంక్షేమశాఖ మంత్రి

జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని: బిసి సంక్షేమశాఖ మంత్రి
, గురువారం, 30 జులై 2020 (17:14 IST)
రాష్ట్రంలో బిసి ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.

రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తొలిసారిగా వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ తన ఛాంబర్ లో గురువారం రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో బిసి సంక్షేమశాఖ ప్రతేక్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, బిసి సంక్షేమశాఖ డైరెక్టర్, ఇన్ చార్చీ కమీషనర్ రామారావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ జె.వి.ఎస్. సుబ్రమణ్యం, రాష్ట్ర స్థాయి ముఖ్య అధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా బిసి సంక్షేమశాఖ విధి,విధానాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారం అడిగి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులు మరింత సమర్ధ వంతంగా పని చేయాలని మంత్రి  కోరారు.సిఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలను నేరవేర్చే విధంగా  అధికారులంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

సమావేశంలో బిసి సంక్షేమశాఖ అధికారులకు మార్గనిద్దేశం చేశారు.రాష్ట్ర అధికారులు బిసి సంక్షేమ పధకాల వివరాలు,పధకాలు అమలు విధానాన్ని మంత్రికి వివరించారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి,సక్రమంగా అమలు జరిగేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం బిసి వర్గాల ప్రజల అభ్యున్నతికి  కట్టుబడి వుందని  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుద్ధాన్ని గెలవడానికి జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా: ఉండవల్లి