Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో వైఎస్ జగన్ ఒప్పందం: రూ.250 కోట్లకు డీల్

పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత వైఎస్ జగన్ భారీ మొత్తం చెల్లించి పార్టీ ప్రచారానికి సాయపడేలా ఒప్పందం కుదుర్చుకున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన వ్యూహ రచన కోసం ప్రశాంత్ కిషోర్‌కు జగన్ ఇచ్చిన మొత్తం ఎంతో తె

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో వైఎస్ జగన్ ఒప్పందం: రూ.250 కోట్లకు డీల్
హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (09:43 IST)
పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత వైఎస్ జగన్ భారీ మొత్తం చెల్లించి పార్టీ ప్రచారానికి సాయపడేలా ఒప్పందం కుదుర్చుకున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన వ్యూహ రచన కోసం ప్రశాంత్ కిషోర్‌కు జగన్ ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా? ఒక్కసారి మీ గుండె దిటవు చేసుకోండి. రూ. 250 కోట్లు మాత్రమే.
 
దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీలకు 2018 అక్టోబర్‌లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వెలువడగానే జగన్ వెంటనే ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయి భారీ మొత్తం చెల్లించి ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నది తాజావార్త.
 
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఎసి) అనేపేరుతో ప్రశాంత్ ఒక టీమ్‌ను నిర్వహిస్తున్నారు. వందమంది పైగా ఉన్న ఈ టీమ్ ఏదైనా అంశంపై సమగ్ర కార్యాచరణ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తూనే ఉంటుంది.
 
అయితే ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న ప్రశాంత్ ఘోరంగా విఫలమవడంతో అతడిని తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైకాపాలో రెండో ఆలోచన వచ్చిందని కూడా తెలుస్తోంది. యూపీ ఎన్నికల అనుభవం చూశాక ప్రశాంత్‌తో కలిసి పనిచేసే ఆలోచన మానుకోవాలని పలువురు సీనియర్ పార్టీ నేతలు, కొంతమంది ఎంపీలు కూడా జగన్‌కు సలహా ఇచ్చారట.
 
ఎందుకంటే ప్రశాంత సహాయం తీసుకుని యూపీ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ మొత్తం 403 స్థానాలకు గానూ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ చరిత్రలో అదొక ఘోర వైఫల్యం. దాంతో వైకాపా నేతలు ప్రశాంత్‌తో జట్టు కట్టడంపై పెదవి విరిచారు.  కానీ జగన్ వినలేదు. ప్రశాంత్ పార్టీకోసం పని చేస్తారని, అతడు తప్ప తనకు ఎవరిమీదా నమ్మకం లేదని జగన్ తేల్చి చెప్పేశారట.
 
ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రశాంత్ టీమ్ వైకాపా కోసం పని ప్రారంభిస్తుంది. ప్రశాంత్ టీమ్ మొదట తెలుగు దేశం ప్రభుత్వంపై ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితిని ముందుగా అంచనా వేస్తుంది. తర్వాత సెప్టెంబర్ నుంచి ప్రశాంత టీమ్ తన వ్యూహాన్ని అమలు పరుస్తుందని వైకాపా సీనియర్ నేత ఒకరు చెప్పారు.
 
ప్రశాంత్‌తో ఒప్పందానికి జగన్ 250 కోట్లు చెల్లించారని చెబుతున్న ఈ వార్తను నమ్మాలో లేదో తెలియడం లేదు కానీ నిజమే అయితే ఈ సారి ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ఏ స్థాయికి వెళ్లనున్నారో అర్థమవుతుంది. యూపీలో ఫలించని ప్రశాంత్ వ్యూహం ఏపీలో ఫలిస్తుందా.. చూడాల్సిందే మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ పటం నుంచి అమెరికాను లేకుండా చేస్తాం : ఉ.కొరియా గర్జన