Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాలు ... జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం!

విశాఖ శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాలు ... జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం!
విజ‌య‌వాడ‌ , గురువారం, 28 అక్టోబరు 2021 (10:46 IST)
విశాఖలోని శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో సర్వే నంబరు-102లో ఉన్న భూమిని ఇవ్వబోతోంది. పీఠం కార్యకలాపాల విస్తరణకు ఈ భూములను కేటాయిస్తున్నారు. అక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంది. దీనిపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఎజెండాలో మొదటి అంశం కింద దీనిని చేర్చారు. 
 
 
సీఎం కార్యాలయం నుంచి వెళ్లిన ఆదేశాల మేరకు కేవలం రెండే వారాల్లో విశాఖ జిల్లా అధికారులు విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములు పరిశీలించడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, ఎంపిక చేయడం చకాచకా జరిగింది. దీనికి సంబంధించిన చర్చల్లో దేవాదాయశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
 
 
రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. సింహాచలం, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకాతిరుమల, అన్నవరం, పెనుగంచిప్రోలు ఆలయాల పాలకవర్గాల్లో అదనంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించనుంది. దేవాదాయ ట్రైబ్యునల్‌కు అధికారులు కల్పించేలా చట్టసవరణ చేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణాలో గాలులు