రోజాతో కలిసి మెగా బ్రదర్ మరీ ఇంత దిగజారిపోయారేం...? 'జబర్దస్త్' కామెంట్స్...
ఔను... అప్పటిదాకా అందరిచేత పొగడ్తలు కురిపించుకునేవారు ఉన్న ఫళంగా దబుక్కున కిందపడిపోయి అందరి చేత తిట్లు తిట్టించుకోవడం కొన్నిసార్లు జరుగుతుంటుంది. జబర్దస్త్ ప్రోగ్రాం విషయంలోనూ ఇదే జరిగింది. జబర్దస్త్
ఔను... అప్పటిదాకా అందరిచేత పొగడ్తలు కురిపించుకునేవారు ఉన్న ఫళంగా దబుక్కున కిందపడిపోయి అందరి చేత తిట్లు తిట్టించుకోవడం కొన్నిసార్లు జరుగుతుంటుంది. జబర్దస్త్ ప్రోగ్రాం విషయంలోనూ ఇదే జరిగింది. జబర్దస్త్ షోకి మరింత హైప్ తీసుకురావడానికి నాగబాబు -రోజాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో వారిని తప్పుపడుతూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే... గత కొద్దిరోజులుగా సుడిగాలి సుధీర్ టీం జడ్జిలైన నాగబాబు, రోజాలతో గొడవపడినట్లు, ఆ ప్రోగ్రాం నుంచి సుధీర్ ని నాగబాబు గెంటివేసినట్లు ప్రోమా హల్చల్ చేసింది. ఈ ప్రోగ్రాం నిజమేనేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఏప్రిల్ 1కి ముందురోజు ప్రసారమైన ఆ షో చూసినవారికి అదంతా టీఆర్పీ రేటింగుల కోసమేనని అర్థమైపోయింది.
దీనికోసం నాగబాబు-రోజా ఇంత దిగజారిపోతారా అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు... జబర్దస్త్ ప్రోగ్రాముకు భారీగా డిస్ లైక్స్ కూడా పెట్టేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రోగ్రాం నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో..?