Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయం: కాలవ శ్రీనివాసులు

అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయం: కాలవ శ్రీనివాసులు
, గురువారం, 10 డిశెంబరు 2020 (07:39 IST)
రాష్ట్రంలో అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమని మాజీ మంత్రి, టి.డి.పి పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేసే కమిటీల్లో జర్నలిస్టు సంఘాల  భాగస్వామ్యం దశాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే వారి ప్రాతినిధ్యం లేకుండా కేవలం అధికారులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ మంగళవారం 123 వ నెంబర్ జి.ఓ ను జారీ చేయడం పాత్రికేయుల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.

స్వయంగా ఓ మీడియా సంస్థ అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం పూర్వాశ్రమoలో జర్నలిస్టుగా పని చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి పర్యవేక్షణలో పాత్రికేయులపై పగబట్టినట్లు వ్యవహరిస్తుండడం దారుణమని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడి హయాంలో అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యాన్ని  ఒకటి నుంచి అయిదుకు పెంచామన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల్లేని అక్రిడేషన్ కమిటీల్లో పాత్రికేయుల స్థితిగతులను ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.

జర్నలిస్టుల ప్రయోజనాలను దెబ్బ తీసే జి.ఓ 123 ను తక్షణం ఉపసంహరించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పాత కమిటీల జర్నలిస్టుల ప్రాతినిధ్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగేళ్ల చిన్నారిపై దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష.. నాంపల్లి కోర్టు