Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి ఐఎ్‌సవో సర్టిఫికేషన్‌

Advertiesment
ISO Certification
, గురువారం, 25 మార్చి 2021 (10:06 IST)
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఐఎ్‌సవో సర్టిఫికేషన్‌ను పొందింది. హైదరాబాదుకు చెందిన ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి శివయ్య ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్లను పద్మావతి వర్సిటీ వీసీ జమున, రిజిస్ట్రార్‌ మమత, ఐక్యూఏసీ సెల్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరికి అందజేశారు.

బోధన, పరిశోధన, విస్తరణ, పచ్చదనం, పరిశుభ్రత, ప్రయోగశాలలు, వసతులు వంటి పలు అంశాలను పరిశీలించి ఈ గుర్తింపునిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీ్‌షచంద్ర, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి వీసీ, సిబ్బందిని అభినందించారు.
 
ఎస్వీయూ పీజీ పరీక్షల వాయిదా
భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఈ నెల 26 వ తేదీ నుంచీ జరగాల్సిన ఎస్వీయూ పరిధిలో పీజీ మూడవ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి నిర్వహిస్తామని సీఈ దామ్లానాయక్‌ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మదనపల్లెలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి