Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వల్లభనేని వంశీ ఆరోగ్యం వరెస్ట్‌గా మారిపోతోందా? దగ్గుతూ, రొప్పుతూ....

Advertiesment
vallabhaneni vamsi health issue

ఐవీఆర్

, మంగళవారం, 27 మే 2025 (15:43 IST)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం వరెస్ట్ గా మారిపోతున్నట్లు ఆయనను చూస్తేనే అర్థమైపోతుంది. తొలుత నల్లటి జుత్తుతో వుండే వల్లభనేని జైలు నుంచి విచారణకు వెళ్లే క్రమంలో గుర్తుపట్టలేని విధంగా ముగ్గుబుట్టలా తెల్లటి వెంట్రుకలతో బైటకు కనిపించారు. అంతేకాదు... దగ్గుతూ, రొప్పుతూ ఖర్చీఫ్ అడ్డు పెట్టుకుని పోలీసుల మధ్య నడుచుకుంటూ వెళ్లి వాహనం ఎక్కారు. ఆయన పరిస్థితి చూస్తుంటే ఇంతకుముందే పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన ఇప్పుడు మరింత దిగజారినట్లు కనిపిస్తోంది.
 
మరోవైపు వల్లభనేని వంశీకి నిద్రలో శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. వివిధ కేసుల్లో అరెస్టయి ఉన్న వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ న్యూరాలజీ విభాగానికి చెందిన స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షించారు. 
 
వంశీకి ఫిట్స్ ఉన్నాయని గుర్తించారు. పైగా, నిద్రపోయేటపుడు శ్వాస సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. స్లీప్ టెస్ట్ చేసి చికిత్స చేయాల్సివుందని, అయితే తమ వద్ద స్లీప్ టెస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు. 
 
నకిలీ ఇళ్ల పట్టాల కేసులు వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చేందుకు నూజివీడు కోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై పలు దఫాలుగా వాదనలు ఆలకించిన కోర్టు న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. కాగా, ఇదే కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయగా, ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక సబ్జెక్టులో ఫెయిల్- ఫోన్‌లో గేమ్‌లు.. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య