Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

mahesh chandra laddha

వరుణ్

, బుధవారం, 3 జులై 2024 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా వర్గం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లడ్డా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అనంతరం, ఆయనను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్డా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. 
 
హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఎస్ఐఏలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్, నిఘా విభాగంలో ఐజీగానూ చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై  వెళ్లారు. అక్కడ సీఆర్పీఎఫ్ ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేసి తాజాగా ఏపీకి తిరిగొచ్చారు.
 
ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్డా సేవలందిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వామనాన్ని మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్ పేల్చేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్డాతో పాటు ఆయన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. అప్పట్లో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ