Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి... తొలి పైప్ గ్యాస్ సిటీగా...

amaravati

ఠాగూర్

, బుధవారం, 18 డిశెంబరు 2024 (09:17 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ రాజధానిలో గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో గ్యాస్ పైప్ లైన్‌ను నిర్మించనున్నారు. ఇదే జరిగితే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి దేశ చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పక్కా ప్రతిపాదనలతో ముందుకు వచ్చి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. అంటే.. వంట, వాణిజ్య గ్యాస్‌లను ప్రతి ఇంటికి పైపుల ద్వారా గ్యాస్‌ను సరఫరా చేసేలా ఈ ప్రతిపాదలను రూపొందించారు. 
 
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్ఆర్డీబీ) సభ్యులు ఏ.రమణ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైపు లైన్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతి రాజధాని నగరాన్ని దేశంలో మొట్టమొదటి పూర్తి పైప్డ్ గ్యాస్ నగరంగా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన విషయాన్ని ప్రభుత్వం ముందుంచారు.
 
గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్-టెక్ సిటీ (గిఫ్ట్) నగరంలో గ్యాస్ మొదలు విద్యుత్తు, టెలికాం కేబుళ్ల వరకు అన్నీ కూడా అండర్ గ్రౌండ్‌లో ఉంటాయని, అక్కడ ఆవాసాలకు, వ్యాపార సముదాయాలకు, సంస్థలు అన్నింటికీ కూడా పూర్తి పైప్డ్ గ్యాస్ అందించబడుతోందని చెప్పారు. అదే తరహాలో అమరావతి రాజధాని నగరంలో కూడా పూర్తిగా పైప్డ్ గ్యాస్ అందించి రాజధానిని దేశంలో మొట్టమొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పీఎన్జీఆర్సీ ప్రతినిధులు తెలిపారు. 
 
దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమ్మతి తెలియజేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 80 లక్షల మందికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు.
 
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించాలనేది లక్ష్యమని, ఆ దిశగా పీఎన్ జీఆర్సీ అధికారులు సహకారం అందించాలని దినేష్ కుమార్ కోరారు. గ్యాస్ పైపు లైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరింతగా బలపడిన అల్పపీడనం.. నేడు ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు