సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్.. చంద్రబాబు కన్నెర్ర... నెటిజన్ అరెస్టు
సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్‌లు వేసేవారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నెర్రజేశారు. ఇలాంటి పంచ్‌లతో పాటు.. సెటైర్లు, కార్టూన్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర
సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్‌లు వేసేవారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నెర్రజేశారు. ఇలాంటి పంచ్‌లతో పాటు.. సెటైర్లు, కార్టూన్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కారు హెచ్చరించింది.
అంతేకాదండోయ్... శాసనమండలి (పెద్దల సభ) గురించి ఇంటూరి రవి కిరణ్ అనే నెటిజన్ ఓ వ్యంగ్య కార్టూన్ వేసినందుకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దల సభను కించపరుస్తూ కార్టూన్ వేయడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటూరి కిరణ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. చట్ట సభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్, మంత్రులను కించపరుస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
దీనిపై ఇంటూరి రవి కిరణ్ భార్య సుజన మాట్లాడుతూ.. తన శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఎనిమిది మంది వ్యక్తులు వచ్చిన తన భర్తను కారెక్కించి తీసుకెళ్లారని తెలిపారు. ఎక్కడకు తీసుకెళ్లారో కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆమె బోరున విలపిస్తూ చెప్పారు.