Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ఐదు లక్షలు కట్నంగా తెమ్మన్నాడు.. ఎలుకల మందు తాగి?

Advertiesment
lovers
ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీ, కృష్ణాజిల్లా, మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఐదు లక్షలు కట్నం ఇస్తేనే వివాహం చేసుకుంటానని చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 
 
రాగశ్రీ పెళ్లి ప్రసావన తీసుకురాగా.. తనకు రూ.5లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 
 
మనస్తాపంతో రాగశ్రీ ఎలుకల మందు తాగేసింది. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పల్నాడు చౌడేశ్వరి కేసు.. మాచర్ల సీఐ వెంకట రమణపై సస్పెన్షన్ వేటు