Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

Advertiesment
Anganwadi Teacher

సెల్వి

, గురువారం, 4 జులై 2024 (18:16 IST)
Anganwadi Teacher
అంగన్‌వాడీ టీచర్‌ హోదా నుంచి శాసన సభ్యురాలుగా మారారు మిర్యాల శిరీష. ఈమె ఎంతో మంది గిరిజనులకు నిజమైన స్ఫూర్తి. గిరిజన నేపథ్యం నుండి వచ్చిన శిరీష తన పట్టుదల, దృఢ సంకల్పంతో ఎఎస్సార్ జిల్లాలో రంపచోడవరం (ST రిజర్వ్‌డ్) ఎమ్మెల్యేగా ఎదిగారు. 
 
బి.ఇడి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈలోగా, ఆమె తన గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేయడం ప్రారంభించారు. నెలకు రూ.11,000 జీతం తీసుకునేవారు. 
ఆమె భర్త మఠం విజయ భాస్కర్ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువజన విభాగం నాయకుడు. 
 
మంగళగిరిలో యువ గళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్‌ను కలిసేందుకు అవకాశం వచ్చినప్పుడు, రాజకీయాల్లో పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కారణం ఏంటని లోకేష్ అడగ్గా.. అంగన్‌వాడీ వర్కర్ల హక్కుల కోసం తాను పోరాటం చేస్తానన్నారు. అనుకున్నట్లే శిరీష ఎమ్మెల్యే అయ్యారు. 
 
శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పటికీ ఆటోల్లో ప్రయాణించడానికే ఇష్టపడతారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె రాజవొమ్మంగి అంగన్‌వాడీ కేంద్రంలో బోధన కొనసాగిస్తున్నారు. "నా మూలాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇక్కడే నా ఎదుగుదల ప్రారంభమైందని, దీనికి నేను కృతజ్ఞతతో ఉంటాను" అని ఆమె అన్నారు.
 
అంగన్‌వాడీ వర్కర్లు పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పని ఒత్తిడి కారణంగా తన సహోద్యోగులకు గుండెపోటు కూడా వచ్చిందన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, టీచర్‌లకు అర్హత పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం.
 
అయితే వారిలో ఎక్కువ మంది 3వ తరగతి లేదా 4వ తరగతి పరీక్షల్లో మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కాబట్టి, వారు ఎక్కువగా ఆంగ్లంలో ఉండే ఆన్‌లైన్ యాప్‌లలో పని చేయడం, డేటాను నింపడంలో సమస్యను ఎదుర్కొంటారు. దీంతో వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
 
టీడీపీ వారసుడు లోకేష్‌ను కలిసిన ఫొటోను తన భర్త పోస్ట్ చేయడంతో వైసీపీ నేతలు తనను ఎలా వేధించారో, ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ బెదిరించేవారని వివరించారు. అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు కూడా రాజకీయాల్లోకి రావడంపై ఉన్నతాధికారులు తనను హెచ్చరించేవారని ఆమె తెలిపారు.
 
ఇంకా శిరీష మాట్లాడుతూ తన నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పన తన లక్ష్యమన్నారు. వీరిలో చాలా మందికి డీఎస్సీ, డైట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఉద్యోగాలు లేవు. మరికొంత మంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్తున్నారని ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని గిరిజనులకు తాగునీటి సమస్య, మారుమూల గ్రామాలకు రోడ్లు లేకపోవడం, విద్య, వైద్యం తదితర సమస్యలను కూడా పరిష్కరించాల్సి వుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్