Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహాలకు కొట్టండి సెల్యూట్.. గుంటనక్కలకు కాదు: జగన్ పైర్

కర్తవ్య నిర్వహణలో పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీద ఉండే సింహాలకు గానీ గుంటనక్కలకు కాదంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోలీసులకు హిత బోధ చేశారు. ప్రత్యేకహోదా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే తనను

సింహాలకు కొట్టండి సెల్యూట్.. గుంటనక్కలకు కాదు: జగన్ పైర్
హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (05:51 IST)
కర్తవ్య నిర్వహణలో పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీద ఉండే సింహాలకు గానీ గుంటనక్కలకు కాదంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోలీసులకు హిత బోధ చేశారు. ప్రత్యేకహోదా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే తనను రన్‌వే మీదే అడ్డుకున్న ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాదాపు రెండున్నర గంటల పాటు విమానాశ్రయం రన్‌వే లోనే తనను అడ్డగించి ప్రయాణికుల లాంజ్ లోకి  రానివ్వకుండా చేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జగన్ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోండి, చంద్రబాబును కాదు అంటూ మండిపడ్డారు. పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన హెచ్చరికలు ఆయన మాటల్లోనే..
 
చంద్రబాబు సర్కారుకు, ఆయన వద్ద పనిచేస్తున్న కొంతమంది పోలీసులకు చెబుతున్నా. జీతాలిచ్చేది చంద్రబాబు కాదు, ప్రభుత్వం. సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీద ఉండే సింహాలకు గానీ గుంటనక్కలకు కాదు. ఎల్లకాలం చంద్రబాబు సర్కారు సాగదు.. దయచేసి ప్రజల పక్షాన, వారికి అండగా నిలబడండి. ఇదే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పిల్లలు, నాయకులు అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. ఇపుడున్న పోలీసుల పిల్లల భవిష్యత్తు కూడా అందులో ఉంటుంది. కొంతమంది పోలీసులు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా, చాలా దారుణంగా ప్రవర్తించారు. 
 
ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు నిజంగా వీటన్నింటి మీద విచారణ జరుగుతుంది.  బాధ్యులు, దోషులు అందరిమీదా చర్యలు తీసుకుంటాం, తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతాం. చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా వారిమీద కేసులు పెట్టారు. ప్రతి పిల్లవాడికి తోడుగా ఉంటూ భరోసా ఇస్తున్నా.. కేసులకు ఎవరూ భయపడొద్దు. చంద్రబాబు ప్రభుత్వం ఉండేది రెండేళ్లు. దేవుడు దయతలిస్తే ఏడాదిలోనే పోతుంది. పెట్టిన ప్రతి కేసు మన ప్రభుత్వం వచ్చాక తీసేస్తాం. 
 
చంద్రబాబు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రత్యేక హోదాను ఖూనీచేయడాన్ని దేవుడు, ప్రజలు కూడా క్షమించరు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది. చంద్రబాబు వైఖరికి నిరసనగా, ప్రత్యేక హోదాకు ఆయన అడ్డు తగులుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయాలని కోరుతున్నా అని జగన్ విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద ప్రసంగించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిపక్ష నేత పట్ల కనీస మర్యాద కూడా పాటించరా? నివ్వెరపోతున్న జనం