Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపూ లేవు!

తిరుపతి అభివృద్ధి అడ్డదిడ్డంగా మారుతోంది. రాష్ట్రవిభజన తర్వాత ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ఒకటి. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రూ.వేల కోట్లు వ

తిరుపతిలో అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపూ లేవు!
, ఆదివారం, 22 జనవరి 2017 (11:33 IST)
తిరుపతి అభివృద్ధి అడ్డదిడ్డంగా మారుతోంది. రాష్ట్రవిభజన తర్వాత ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ఒకటి. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రూ.వేల కోట్లు విలువచేసే టిటిడి ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. ఆక్రమించిన ప్రాంతంలోనే యధేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులు మాత్రం నిద్రమత్తులో జోగుతున్నారు. దీంతో ఆధ్మాత్మిక నగరం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
 
తిరుపతి అంటే ఒక ప్రత్యేకత. స్వామివారి కింద జీవించాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అటు ఆధ్మాత్మికతకు దగ్గరగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి తిరుపతిలో నివాసాలుగా ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నగరానికి ప్రభుత్వం మేలు చేస్తుందా కీడు చేస్తుందా. 
 
తిరుపతి నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెయ్యడానికి ఒకవైపు కార్పొరేషన్‌, మరోవైపు తిరుపతి తుడా, ఇంకోవైపు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సహాయాన్ని అందించడానికి టిటిడి ఎలాగో ఉండనే ఉంది. అయినా అధికారుల నిర్లక్ష్యమో..నాయకుల అత్యుత్సాహం కారణంగా కబ్జా కోరులకు తిరుపతి అడ్డాగా మారిపోయింది. ఒకవైపు స్థలాలను కబ్జా చేయడంతో పాటు అక్రమంగా భవనాలను నిర్మిస్తున్నారు. కార్పొరేషన్‌లో ఇళ్ళు కట్టాలంటే సవాలక్ష పర్మిషన్లు అవసరం. 
 
కానీ ఇవేవీ పట్టించుకోకుండా అక్రమార్కులు ఇళ్ళనే కాదు ఏకంగా అపార్టుమెంట్లనే లేపేస్తున్నారు. రాత్రికి రాత్రే వాటిని అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్న వారు తిరుపతిలో ఎంతోమంది ఉన్నారు. వెంకన్న సాక్షిగా తిరుపతిలో కబ్జాల పర్వం కొనసాగుతున్నా పట్టించుకునే అధికారులు గానీ ప్రభుత్వ పెద్దలు గానీ లేకపోవడం దురదృష్టకరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల కన్నీరు క్షేమదాయకం కాదు : పవన్ కళ్యాణ్