Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రెండ్ అని ఇంటికి పిలిస్తే భార్యను వశపరుచుకున్నాడు... మిత్రుడు నైట్ డ్యూటీకి వెళ్లగానే...

స్నేహితుడే కదా ఇంటికి చేరదీసిన పాపానికి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమేకాకుండా, అతను నైట్ డ్యూటీకి వెళ్లగానే ఇంటికొచ్చి కామవాంఛ తీర్చుకోసాగాడు. ఈ విషయం మిత్రుడిక

ఫ్రెండ్ అని ఇంటికి పిలిస్తే భార్యను వశపరుచుకున్నాడు... మిత్రుడు నైట్ డ్యూటీకి వెళ్లగానే...
, బుధవారం, 25 జనవరి 2017 (09:35 IST)
స్నేహితుడే కదా ఇంటికి చేరదీసిన పాపానికి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమేకాకుండా, అతను నైట్ డ్యూటీకి వెళ్లగానే ఇంటికొచ్చి కామవాంఛ తీర్చుకోసాగాడు. ఈ విషయం మిత్రుడికి తెలిసి అడ్డుతగలడంతో ఏకంగా అతన్నే చంపేశాడో కిరాతకుడు. దీనికి హతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
చెంగల్పట్టు సమీపంలోని సాలవాక్కం గ్రామానికి చెందిన (36) అనే వ్యక్తి శ్రీపెరుంబుదూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు చిన్న భాగాలను తరలించగల ప్రొక్లెయినర్‌ కూడా సొంతది ఉంది. మురళికి భార్య వనజ, విక్రమ్‌, వినోద్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళీ తనకున్న ప్రొక్లెయినర్‌ను శ్రీపెరుంబుదూరుకు చెందిన రమేష్‌ (28) అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో మురళి, రమేష్‌ మంచి స్నేహితులుగా మారారు. దీంతో రమేష్‌కు వనజకు మధ్య మంచి స్నేహం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
మురళి నైట్‌ డ్యూటీలకు వెళ్ళినపుడు రమేష్‌ సాలవాక్కం వచ్చి వనజతో కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారి సహాయంతో రమేష్‌కు తెలిసింది. అయినప్పటికీ మురళి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ రోజు తన భార్య తనకు తెలియకుండా స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉండటం మురళి కంటపడింది. దానిని తీసుకుని పరిశీలించగా అందులో కేవలం రమేష్‌ ఫోన్ నంబరు మాత్రమే ఉండటం చూసి హతాసుడయ్యాడు. ఆ తర్వాత భార్యను మందలించి.. రమేష్‌ను కూడా తన ఇంటికి రావొద్దంటూ గట్టిగా హెచ్చరించాడు.
 
దీంతో పగ పెంచుకున్న రమేష్.. మురళి అడ్డు తొలగించుకునేందుకు కిరాయి ముఠా సభ్యులతో కలిసి హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలు, మురళి భార్య వనజకు కూడా చెప్పాడు. ఆ ప్రకారంగా ఈనెల 19వ తేదీన ఓరగడంలో పని ముగించుకుని ఇంటికి వస్తున్న మురళిని రమేష్‌ హత్య చేశాడు. ఈ విషయాన్ని వనజకు రమేష్‌ తెలియజేయగా ఆమె మురళి ప్రమాదంలో చనిపోయినట్టు పోలీసుల ముందు నటించింది. 
 
అయితే మురళి ఇంట్లో లేనిసమయంలో రమేష్ సాలవాక్కం వచ్చి వనజతో ఉండే విషయాన్ని ఇరుగుపొరుగువారు పోలీసుల చెవిన పడేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వనజను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో రమేష్‌తో పాటు.. వనజనకు కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే శాఖ నష్టపరిహారం ఇవ్వలేదు.. వాట్సాప్‌లో బెంగూళూరు యూత్ సూసైడ్ నోట్