Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు బంధు పథకంతో చెక్కు కావాలా? అయితే నా కోరిక తీర్చు...

ప్రమాదంలో భర్త చనపోతే భూమినే నమ్ముకుంది ఓ మహిళా రైతు. ఆ భూమికి పట్టా పాస్‌బుక్కు మంజూరు చేయడానికి రైతుబంధు పథకంలో చెక్కు రావాలంటే తన కోరిక తీర్చాలని కామవాంఛను బయటపెట్టారు తహశీల్దారు. తన కోర్కెను తీర్చకపోతే భూమిపై సివిల్‌ కేసు వేయిస్తానని బెదిరించాడు.

Advertiesment
Rythu Bandhu Cheque
, బుధవారం, 20 జూన్ 2018 (09:56 IST)
ప్రమాదంలో భర్త చనపోతే భూమినే నమ్ముకుంది ఓ మహిళా రైతు. ఆ భూమికి పట్టా పాస్‌బుక్కు మంజూరు చేయడానికి రైతుబంధు పథకంలో చెక్కు రావాలంటే తన కోరిక తీర్చాలని కామవాంఛను బయటపెట్టారు తహశీల్దారు. తన కోర్కెను తీర్చకపోతే భూమిపై సివిల్‌ కేసు వేయిస్తానని బెదిరించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం, చిన్నిపాడులో బాధితురాలి తల్లికి పేరున ఉన్న 1.06 ఎకరాల భూమికి కొత్త పట్టా పాస్‌బుక్కు, రైతు బంధు చెక్కు మంజూరుచేసింది ప్రభుత్వం. 
 
అయితే సదరు భూమిపై కన్నేసిన ఓ కబ్జా రాయుడు రైతు బంధు చెక్కును, పాస్‌బుక్కును ఆమెకు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో మానవపాడు తహసీల్దార్‌ను సంప్రదించింది బాధితురాలు. రైతుబంధు చెక్కు కావాలంటే లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో అసభ్య పదజాలంతో దూషించాడు తహశీల్దారు. దీంతో తమకు న్యాయం చేయాలని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది మహిళా రైతు.
 
విచారణకు స్వీకరించిన మానవహక్కుల కమిషన్ జోగుళాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసి ఘటనపై నివేదిక సెప్టెంబర్‌ 9లోగా అందజేయాలని ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమిలి చిచ్చు... మంత్రి గంటా దారెటు?