Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్రం తెగేసిచెప్పినా, జగన్ ఎందుకు నోరెత్తడంలేదు?: టీడీపీ

Advertiesment
కేంద్రం తెగేసిచెప్పినా, జగన్ ఎందుకు నోరెత్తడంలేదు?: టీడీపీ
, మంగళవారం, 9 మార్చి 2021 (09:34 IST)
వైసీపీప్రభుత్వ వైఫల్యాలను కేంద్రప్రభుత్వమే తేటతెల్లం చేసిందని, వైసీపీకిచెందిన విశాఖపట్నంఎంపీ ఎంవీ.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖఉక్కుఫ్యాక్టరీని నూటికినూరుశాతం ప్రైవేటీకరించబోతున్నామని కేంద్రమంత్ర్రి నిర్మలాసీతారామన్ తేల్చి చెప్పినా, ఉభయసభల్లోని 28మంది వైసీపీఎంపీలు నోరెత్తినపాపాన పోలేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు.

ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖఉక్కు  ప్రైవేటీకర ణ జరక్కుండా వైసీపీఎంపీలు 28 మంది, ఏంచేస్తున్నారని జగన్ రాసిన లేఖ ఏమైందని రఫీ టీడీపీతరుపున ప్రశ్నించారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణతోపాటు, రామాయపట్నం పోర్టు నిర్మాణా నికి నిధులివ్వమని కేంద్రంతేల్చిచెప్పినా, వైసీపీఎంపీల్లో చలనం లే కపోవడానికి కారణం, ముమ్మాటికీ జగన్ పై ఉన్నకేసులేనని రఫీ తేల్చిచెప్పారు.

తనపై ఉన్నకేసులభయంతోనే ముఖ్యమంత్రి, తన పార్టీఎంపీల నోళ్లుకట్టేశాడన్నారు. ఎంపీలంతా మూకుమ్మడిగా సం తకాలు పెట్టి, కేంద్రాన్నిడిమాండ్ చేసిన సందర్భం నిమ్మగడ్డప్రసాద్ ను సెర్బియా పోలీసులనుంచి విడిపించేందుకు జరిగిందితప్ప, రాష్ట్ర ప్రయోజనాలకోసం వారుఏనాడూ నోరుతెరవలేదన్నారు.

విశాఖ ఉక్కుఫ్యాక్టరీ కోసం నెలనుంచీ దీక్షలుజరుగుతూ, కార్మికులంతా రోడ్డునపడి ధర్నాలుచేస్తున్నా ముఖ్యమంత్రి తనకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడన్నారు. పోస్కో కంపెనీతో లోపాయికారీఒప్పం దంచేసుకున్న ముఖ్యమంత్రి, ఎప్పుడు స్టీల్ ప్లాంట్ పరిధిలోని 7 వేలఎకరాలుకొట్టేద్దామా అని ఎదురుచూస్తుంటే, విజయసాయి రెడ్డే మో ఉక్కుఫ్యాక్టరీని రక్షించేపేరుతో దొంగనాటకాలు ఆడుతున్నా డని టీడీపీనేత స్పష్టంచేశారు.

22నెలల వైసీపీప్రభుత్వపాలనలో కేంద్రంనుంచి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏంసాధించాడన్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సహా, అన్నింటినీ తాకట్టుపెట్టిన జగన్, ఇప్పుడు పోర్టులు, రహదారులను కూడా కేంద్రానికి ధారాధత్తం చేశాడన్నారు కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, మోసాలపై నోరుతెరిచి మా ట్లాడని ముఖ్యమంత్రి,  ఎంతసేపూ రాజధాని మహిళలు, రైతులపై కక్షసాధింపుచర్యలకే పరిమితమయ్యాడన్నారు.

అమరావతి ప్రాంతానికి కనెక్ట్ అయ్యేలా చంద్రబాబునాయుడు మూడురైల్వేమార్గాల ను కేంద్రంనుంచి తీసుకొస్తే, జగన్ వాటిని గురించి ఏనాడూ పట్టిం చుకోలేదన్నారు. రాజీనామాలుచేస్తే, ఏమైనాసాధించవచ్చు, ఎంత టి త్యాగాలైనా చేయవచ్చని ప్రతిపక్షంలోఉన్నప్పడు గప్పాలు పలి కిన జగన్, ఇప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తన పార్టీఎంపీలతో ఎందుకు రాజీనామాచేయించడని రఫీ నిలదీశారు.

తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఎందరి ప్రాణత్యాగాల ఫలిత మో అయిన ఉక్కుఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేట్ వారికి ధారాధత్తం చేస్తు న్నామని తెగేసిచెప్పినా వైసీపీఎంపీల్లో రోషం, పౌరుషంలేకుండా పోయాయన్నారు.

కేంద్రప్రభుత్వం రాష్ట్రానికిచేస్తున్న అన్యాయంపై  జగన్ తక్షణమే తనపార్టీఎంపీలతో రాజీనామాచేయించాలని, ఆయ న అందుకు సిద్ధమైతే, టీడీపీఎంపీలుకూడా రాజీనామాలుచేసి,  జగన్ తో కలిసి ప్రజల్లోకివెళ్లి పోరాటంచేయడానికి సిద్ధంగా ఉన్నారని రఫీ తేల్చి చెప్పారు.

తనపై ఉన్న కేసులను తొలగించు కోవడానికి ముఖ్యమంత్రి రాష్ట్రప్రయోజనాలను, హక్కులను, ఏపీకి రావాల్సిన నిధులను కేంద్రానికి వదిలేస్తానంటే ప్రజలుచూస్తూ ఊ రుకోరని ఆయన హెచ్చరిచాంరు. పోలీసులతో ప్రతిపక్షాలు, ప్రశ్నించేవారిపై దాడులుచేయించడం, అప్పులుతీసుకొచ్చి సంక్షేమ పథకాలపేరుతో అయినకాడికి దోచుకోవడం తప్ప, జగన్ రాష్ట్రానికి చేసిందేమీలేదన్నారు.

జగన్ పాలనతో విసిగివేసారిపోయిన ప్రజలు , మున్సిపల్ ఎన్నికల్లో  చంద్రబాబుప్రచారానికి భారీగా తరలివచ్చి, తమమద్ధతు తెలియచేస్తున్నారన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్నింటి లో మొండిచెయ్యిచూపి, ఏంచేసుకుంటారో చేసుకోండని రీతిలో మాట్లాడుతున్నా జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్రంతోపోరాడి రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులను కూడా జగన్ నిర్వీర్యంచేశాడన్నారు. రాష్ట్రం మొత్తం ఆటవికరాజ్యంగా మార్చేసి, మహిళలు, మైనారిటీలు, దళితులు, బీసీలపై దాడులుచేయించడం తప్ప, జగన్ చేసిందేమిటో చెప్పాలన్నారు.

ఆయన అమలుచేస్తున్న దిక్కుమాలినసంక్షేమపథకాలతో జనంలో ఆగ్ర హావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీలో రాష్ట్రానికి ఎటువంటి ఈక్వీటీ షేర్లు లేవని చెబుతున్న కేంద్రం, ఆ కర్మాగారం రాష్ట్రభూభాగంలో ఉన్నందున రాష్ట్రానికి అన్యాయంచేయకుండా, కార్మికులప్రయోజనాలను కాపా డాలని రఫీ డిమాండ్ చేశారు.

ఏపీప్రజల త్యాగాల ఫలితంగానే వి శాఖఉక్కుఫ్యాక్టరీ రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఒక్కఛాన్స్ అని బతి మాలి, ప్రజల ఓట్లతో జగన్ ముఖ్యమంత్రి అయింది విశాఖఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంచేయడానికేనా అనిరఫీ ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి, కడపస్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంనుంచి నిధులుతీసుకురాలేని అసమర్థముఖ్యమంత్రి ఉంటే ఎంత.. పోతేఎంతన్నారు. 

ఫోర్జరీసంతకాలతో నామినేషన్లు ఉపసం హరింపచేయడం, బెదిరించడం, డబ్బులకట్టలతో ప్రత్యర్థిపార్టీల వారిని లోబరుచుకొని ఏకగ్రీవాలు చేసుకోవడంతప్ప, వైసీపీనేతలు, మంత్రులు, ఏంచేస్తు న్నారని రఫీ ప్రశ్నించారు. రాష్ట్రప్రయోజనాల గురించి పట్టించుకోని వైసీపీమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను చూసిప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు.

అధికారపార్టీ ఎంపీలకు ఏమాత్రం సిగ్గు, శరమున్నా, వారు విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి సమాధానం చెప్పగానే, అందుకు సంబం ధించినప్రతులను చింపిపారేయాల్సిందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, బడ్జెట్ ప్రతులనుచించి తననిరసనవ్యక్తంచేసిన ఉదంతం, వైసీ పీవారికి గుర్తులేదా అనిరఫీ నిలదీశారు. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీక రణకు జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వమే నైతికబాధ్యత వహించా ల్సి ఉంటుందని రఫీ స్పష్టంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మహా శివరాత్రికి 3,777 ప్రత్యేక బస్సులు